నయనతార స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లోనే అగ్ర హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇక తెలుగు..తమిళ్ భాషల్లో అమ్మడి డిమాండ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కోట్లలో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది. ఆమె కేటాయించిన కాల్షీట్లు ప్రకారం షూటింగ్ పక్కా జరగాలి. లేదంటే అదనంగా నయన్ డేట్లు కేటాయించడం అన్నది జరగదు.
ఇక సినిమా ప్రమోషన్ విషయంలో తనకెంలాంటి సంబంధం లేదని ముందుగానే అగ్రిమెంట్ చేసుకుంటుంది. అడ్వాన్స్ తీసుకునే సమయంలో దానికి సంబంధించి ఒప్పంద పత్రం రాయించుకుంటుంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఈ నిబంధన నయన్ తప్పక పాటిస్తుంది. అప్పుడెప్పుడో శేఖర్ కమ్ములా తెరకెక్కించిన `అనామిక` ప్రమోషన్ లో పాల్గొంది.
ఆ తర్వాత కేవలం భర్త విగ్నేష్ శివన్ తీసిన సినిమాల ప్రచారానికి తప్ప ఇంకెలాంటి ప్రచారానికి హాజరు కాదు. ఈరకమైన నయన్ తీరుపై ఎన్ని విమర్శలు తెరపైకి వచ్చినా ఐడోంట్ కేర్ అంటూనే ముందుకు సాగింది. ఒకానొక సందర్భంలో ఈవిషయంలో తెలివైన లాజిక్ సైతం చెప్పుకోచ్చింది. హీరోయిన్ల ఇమేజ్ తోనో..హీరోల స్టార్ డమ్ తోనే కాదు.. ఏ సినిమా అయిన మెరిట్ తో మాత్రమే మార్కెట్ లోకి వెళ్లాలి..సక్సెస్ అవ్వాలి తప్ప ప్రమోషన్ వల్ల కాదంటూ తెలివైన సమాధానం సైతం ఇచ్చింది.
అయితే ఇప్పుడిదే విషయంలో నయన్ ని సాయిపల్లవితో ముడి పెట్టి మాట్లాడటం సోషల్ మీడియాలో చర్చకొస్తుంది. సాయి పల్లవి నేచురల్ పర్పెర్మార్. గొప్ప డాన్సర్. నటిగా ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. పారితోషికంలోనూ నయన్ కి పోటీగా వెళ్తుంది. ఇలా ఓ పోలిక తీసుకొస్తూ నయన్ కన్నా పల్లవి ఉత్తమంగానే కనిపిస్తుందని అంటున్నారు.
ఇటీవల రిలీజ్ అయిన `విరాట పర్వం` సినిమాని తన భుజస్కందాలపై మోసి పెద్ద సక్సెస్ లో భాగమైందని పల్లవిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి ఎంతో సపోర్ట్ గా నిలిచింది. షూటింగ్ డిలే అయినా...రిలీజ్ ఆలస్యమైన మేకర్స్ కోరిన విధంగా ఎంతో సహకారాన్ని అందించింది. ఇక ప్రచారం సమయంలో పల్లవి దూకుడు గురించి చెప్పాల్సిన పనిలేదు. అన్నీ రకాల మీడియాల్ని చుట్టేసింది. `విరాటపర్వం`లో తనదే కీలక పాత్ర కావడంతో సినిమాకి వీలైనంత పాజిటివ్ బజ్ తీసుకొచ్చే ప్రయత్నం నిజంగా ప్రశంసనీయం.