సినిమా అన్నంతనే గ్లామర్ ప్రపంచం. అలాంటి చోట ముఖంలో మెటిమలతో ఉండే అమ్మాయికి సినిమా ఛాన్సులు ఇస్తారా? అది కూడా హీరోయిన్ గా? అంటే నో చెప్పేవాళ్లు సాయిపల్లవికి ముందు వరకు. కానీ.. ఆమె అలాంటి గీతల్ని చెరిపేయటమే కాదు.. అందానికి ఫలానా నిబంధనలు ఉంటాయన్న రూల్స్ ను బ్రేక్ చేసింది. అంతేకాదు.. సాయి పల్లవి చేతి వేళ్లు చూస్తే.. చాలామంది హీరోయిన్ల మాదిరి గోళ్లు అందంగా పెంచుకున్నట్లు కనిపించదు. మన పక్కింటి అమ్మాయిలా ఉండే ఈ హుషారైన పోరి.. సమ్ థింగ్ స్పెషల్ అని మాత్రం చెప్పక తప్పదు.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నప్పటికీ.. మిగిలిన గ్లామర్ హీరోయిన్లకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో వ్యవహరించటం సాయి పల్లవి సొంతంగా చెప్పాలి. ఈ మధ్యన వరుస సినిమాల్లో కనిపిస్తున్న ఆమె నటించిన తాజా చిత్రం గార్గి విడుదల కావటం తెలిసిందే. ఎప్పుడూ స్మైలీ ఫేస్ తో.. సరదాగా.. కూల్ గా కనిపించే ఈ ఫిదా పోరిలో.. కోపం యాంగిల్ కూడా ఉందట. కానీ.. అది చాలా రేర్ గా వస్తుందని చెప్పింది.
తనకు అస్సలు కోపమే రాదని..కానీ తాను నిద్ర పోతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే మాత్రం తనకు పిచ్చ కోపం వస్తుందని చెబుతుంది. అంతేకాదు.. వరుస సినిమాలు చేస్తూ.. బోలెడంత సంపాదిస్తున్నా తన కోసం ఖర్చుపెట్టుకోవటానికి పెద్ద ఇష్టం ఉండదని చెబుతుంది. అదే సమయంలో తన స్నేహితులకు ఏదైనా ఇష్టమని తెలిసిన వెంటనే వారికి దాన్ని కొనిపించాలనిపిస్తుందని చెబుతుంది. అందుకే.. తన స్నేహితులకు ఏదైనా నచ్చిందంటే దాన్ని కొనిస్తానని చెబుతున్న సాయి పల్లవి..రీసెంట్ తన ఫ్రెండ్ ఒకరికి వాచ్ ను బహుమతిగా ఇచ్చినట్లు చెప్పింది.
ఇదంతా చదివిన తర్వాత సాయి పల్లవి లాంటి ఫ్రెండ్ ఒకరు ఉంటే బాగుంటుందని అనిపించక మానదు. ఎవరికి వారు కొనుక్కోవటం అందరూ చేసేదే. కానీ.. స్నేహితుల ఆనందం కోసం ఖర్చును చూసుకోకుండా ఉండటం అందరికి సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయంలోనూ సాయి పల్లవి రేర్ పీస్ గా చెప్పక తప్పదు.