సీరియల్ యాక్టర్ సోనియా సింగ్ సాయి ధరం తేజ్ విరూపాక్ష సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది. సీరియల్స్ లో నటిస్తున్న సోనియా సింగ్ కు ఈ సినిమా మంచి బూస్టింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే సోనియా సింగ్ మాట్లాడటం మొదలు పెడితే అందులో బోలెడన్ని డబుల్ మీనింగ్ డైలాగులు దొర్లుతాయి. కావాలని అంటుందా లేక అలా వస్తుందా అన్నది తెలియదు కానీ ఆమె మైక్ అందుకుంది అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో హడావిడి చేస్తుంది.
అయితే అది ఆ కాసేపటికి నవ్వుకోడానికి బాగుంటుంది కానీ తర్వాత ఆలోచిస్తే ఒక అమ్మాయి అలా మాట్లాడటం కొద్దిగా ఇబ్బంది కరంగానే ఉంటుంది. సాయి ధరం తేజ్ విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా స్టేజ్ మీద తన డబుల్ మీనింగ్ మాటలతో నవ్వించింది సోనియా సింగ్. అయితే రిలీజ్ ముందు లేటెస్ట్ గా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టగా అందులో భాగంగా ఒక రిపోర్టర్ సోనియా సింగ్ ను మీరు మాట్లాడితే డబుల్ మీనింగ్ గా మాట్లాడుతారు ఎందుకు అని అడిగాడు.
రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సోనియా సింగ్ అదే రేంజ్ లో సమాధానం ఇచ్చింది. తాను డబుల్ మీనింగ్ మాట్లాడటం లేదని తను మాట్లాడింది డబుల్ మీనింగ్ తీస్తున్నారని చెప్పింది. దానితో తను క్లారిటీతో ఉన్నట్టు అర్థమైంది. మొత్తానికి సీరియల్ యాక్ట్రెస్ సోనియా సింగ్ విరూపాక్ష సినిమాతో మంచి ఐడెంటిటీ తెచ్చుకుందని చెప్పొచ్చు.
సాయి ధరం తేజ్ విరూపాక్ష సినిమా విషయానికి వస్తే సుకుమార్ అసిస్టెంట్ కార్తీక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను బోగవల్లి ప్రసాద్, సుకుమార్ కలిసి నిర్మించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందించారు. హారర్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమాపై బజ్ బాగానే ఉండగా సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో మరికొద్ది గంటల్లో తెలుస్తుంది.