కొన్ని సందర్భాలు చాలా అరుదుగా అనిపిస్తాయి. యాథృచ్ఛికమే అయినా ఆ సందర్భానికి ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేక సందర్భం సీనియర్ కథానాయిక విజయశాంతికి ఎదురైంది. సూపర్ స్టార్ కృష్ణ సినిమాతో హీరోయిన్ అయిన విజయశాంతి.. ఆయన కుమారుడు మహేష్ సినిమాతో పరిశ్రమలో రీఎంట్రీ ఇస్తుండడం ప్రస్తుతం హాట్ టాపిక్. వివరాల్లోకి వెళితే..
సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఓల్డ్ క్లాసిక్ `ఖిలాడీ కృష్ణుడు` అనే చిత్రంతో విజయశాంతి కథానాయికగా ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. కృష్ణ- ఎన్టీఆర్- శోభన్ బాబు- మురళి మోహన్- చిరంజీవి- బాలకృష్ణ- వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన విజయశాంతి నటించారు. తెలుగు- తమిళ పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగారు. అలాగే లేడీఓరియెంటెడ్ చిత్రాల కథానాయికగానూ టాప్ రేంజును చూపించారు. అయితే అంత గ్రాఫ్ ఉన్న విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే 13 ఏళ్ల గ్యాప్ తర్వాత తిరిగి మహేష్ 26వ చిత్రంతో పునరాగమనం చేస్తుండడం చర్చకు వచ్చింది. మహేష్ కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వం లో ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అనీల్ సుంకర- దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు` లో విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నిన్నటిరోజున హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే.
తాజాగా తాను రీఎంట్రీ ఇస్తున్న సంగతిని విజయశాంతి అధికారికంగా ధృవీకరించారు. ``తెలుగులో నా తొలి సినిమా సూపర్ స్టార్ కృష్ణతో నటించిన `ఖిలాడీ`.. ఆ తర్వాత 150 సినిమాలు చేశాను. రాజకీయాల్లోకి వెళ్లడంతో 13 సంవత్సరాలు సినిమాలకు దూరమయ్యాను. తొలి సినిమా కృష్ణతో నటిస్తే.. నా రీఎంట్రీలో మొదటి సినిమా ఆయన కుమారుడు మహేశ్‌బాబుతో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది`` అని ఓ పత్రిక ప్రకనటలో విజయశాంతి తెలిపారు. ఇందులో మహేష్ కి అత్త పాత్రలో విజయశాంతి నటిస్తున్నారని ప్రచారం సాగుతున్నా అధికారికంగా తెలియాల్సి ఉంది.