‘హార్ట్ అటాక్’లో ఆదా శర్మను చూసి ‘క్యూట్ హీరోయిన్’ అన్న ట్యాగ్ లైన్ ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు. ఐతే తొలి సినిమా తెచ్చిన పేరును ఈ ముంబయి భామ సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయింది. లోపం ఆమెదో.. డైరెక్టర్లదో చెప్పలేం కానీ.. మంచి రేంజికి వెళ్తుందనుకున్న ఈ భామ.. చాలా త్వరగా ఫేడవుట్ అయిపోయింది. అరంగేట్రం చేసిన రెండేళ్లకే ప్రాధాన్యం లేని కరివేపాకు రోల్స్ చేసే స్థాయికి పడిపోయింది. సన్నాఫ్ సత్యమూర్తి - సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాల్లో ఆదాను చూసి ఆమె అభిమానులు చాలా ఫీలైపోయారు.
ప్రస్తుతం ఆదా చేతిలో ఒకటో రెండో అవకాశాలున్నాయి. వీటితో నెట్టుకురావడం కష్టమని.. కెరీర్ను మళ్లీ ట్రాక్ లో పెట్టుకోవడం కోసం గ్లామర్ గేట్లు తెరుస్తోంది ఆదా. ఈ మధ్య అమ్మడు వరుసగా హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తోంది. వాటిలో ప్రధానంగా ఎద అందాల్నే ఎరగా వేస్తోంది. తన సినిమాల్లో పద్ధతిగానే కనిపించిన ఆదా.. ఈ ఫొటో షూట్లలో మాత్రం క్లీవేజ్ షోలతో రెచ్చిపోతోంది. తనలో రసిక ప్రియులు కోరుకునే యాంగిల్స్ చాలా ఉన్నాయని.. ఒంపుసొంపులకే తక్కువేమీ కాదని.. ఈ ఫొటో షూట్ తో చెప్పకనే చెబుతోంది ఆదా. ఐతే మొదట్నుంచి ఈ యాంగిల్స్ చూపించి ఉంటే.. ఆమె ఇమేజ్ వేరుగా ఉండేది. అవకాశాలకూ కొదవుండేది కాదు. కానీ ఇప్పుడు కెరీర్ అంతా దెబ్బ తిన్నాక ఇలా గ్లామర్ గేట్లు తెరిచినా పెద్దగా ప్రయోజనం ఉండదేమో మరి.