హీరోయిన్ ఆదాశర్మ.. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఇప్పటివరకూ తెలుగులో డబ్బింగ్ చెప్పడం పక్కన పెడితే.. మాట్లాడేందుకు కూడా ఎప్పడూ ట్రై చేసినట్లుగా కనిపించలేదు. కానీ ఇప్పుడు తెలుగు నేర్చేసుకుంటోంది ఆదా. ఇదంతా ఓ హిందీ సినిమా కోసం కావడం మరీ విచిత్రం.
బాలీవుడ్ లో కమాండో2 చేస్తోంది ఆదా శర్మ. 'ఈ సినిమాలో నేను విజయవాడ నుంచి వచ్చిన ఓ తెలుగు అమ్మాయిగా నటిస్తున్నాను. నేను హైద్రాబాద్ స్లాంగ్ తో తెలుగు మాట్లాడ్డం అందరికీ డిఫరెంట్ గా అనిపించడం ఖాయం' అంటున్న ఆదా శర్మ.. 'తెలుగు సినిమాల్లో నాకు వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పినా.. నేను తెలుగు డైలాగులను పూర్తిగా నేర్చుకుంటాను. ఓ ఏడాదిన్నరగా హైద్రాబాద్ లో ఉండడంతో.. నా చుట్టుపక్కల ఉన్నవాళ్లు మాట్లాడే తెలుగును అబ్జర్వ్ చేసి నేర్చుకుంటూ ఉంటాను. అయితే నా వాయిత్ డబ్బింగ్ చెప్పడం మాత్రం కమాండో2కి మాత్రమే' అంటూ సంతోషపడిపోతోంది.
ఇప్పుడు ఓ ట్యూటర్ ని పెట్టుకుని మరీ తెలుగు నేర్చుకుంటున్న ఆదా.. ఎలాంటి తప్పులు లేకుండా.. స్లాంగ్ కూడా తేడా రాకుండా తెలుగు మాట్లాడేస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పేస్తోంది. హిందీ సినిమాలో వినిపించే ఈ తెలుగు కానీ క్లిక్ అయిందంటే.. ఇక తెలుగు సినిమాల్లో అమ్మడి సౌండింగ్ వినేయచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/