క్షణం హీరోయిన్ ఆదా శర్మకి.. బెజవాడ ట్రిప్ ఓ పీడకలలా తయారైంది. ఈ మూవీ సక్సెస్ ని ప్రేక్షకులతో పంచుకునేందుకు విజయవాడ వస్తున్నట్లు ముందుగానే చెప్పింది ఆదా శర్మ. ఓ మాల్ లో మిమ్మల్ని కలుస్తానంటూ.. ట్వీట్ కూడా చేయడంతో.. ఫ్యాన్స్ భారీగానే చేరుకున్నారు. ఇక్కడీ భామకు మంచి ఫాలోయింగే ఉంది. గరం గరం.. క్షణం క్షణం.. అంటూ ఆదా కోసం ఓ పాట కూడా అందుకున్నారంటే.. ఈ భామకున్న క్రేజ్ అర్ధమవుతుంది.
కానీ మొత్తం కార్యక్రమం అయిపోయాక అనుకోని సంఘటన జరిగింది. తిరిగి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. ఔత్సాహికులు ఆదా దగ్గరకు వచ్చేందుకు తోపులాటకు దిగారు. అక్కడ భారీగానే సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నా.. వారి వల్ల కాలేదు. 2వేలకు పైగా జనాలు తోసుకురావడంతో తొక్కిసలాట కంట్రోల్ చేయడం సాధ్యపడలేదు. ఆదా శర్మను ఫ్యాన్స్ బాగా ఇబ్బంది పెట్టారని తెలుస్తోంది. దాంతో భయపడ్డ ఆదా.. బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించేటపుడు.. కొంతమంది టచ్ చేయాలని చూడటం.. అలాగే చేతలు పట్టుకోవడం.. వంటి వెకిలి చేష్టలు చేశారట.
ఈ సంఘటన తర్వాత మరేం మాట్లాడకుండా ఆదా శర్మ హైద్రాబాద్ వెళ్లిపోయింది. హీరోయిన్ ని దగ్గరి నుంచి చూడాలనే ఉత్సాహం ఉండచ్చు కానీ.. మరీ ఆమెను హింసించడం అంటే అది అభిమానం అనిపించుకోదని అందరూ గ్రహించాల్సి ఉంది. గతంలో సమంత - తాప్సీ - హెబా పటేల్ లకు కూడా ఇలాగే జరిగింది.