నేను, అనసూయ కలిసి యాక్ట్ చేయలేదు

Update: 2016-02-22 17:30 GMT
ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ''క్షణం''. వచ్చే శుక్రవారం రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాలో బ్యూటిఫుల్‌ అదా శర్మ హీరోయిన్‌ రోల్‌ చేస్తోంది. కాకపోతే ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో ఎక్కువగా హైప్‌ అంతా అనసూయ చుట్టూతానే తిరుగుతోందా అనే సందేహం రాకమానదు. ఎందుకంటే.. ఇటు అడివి శేష్‌ అటు అదా శర్మ ల కంటే అనసూయకే మాంచి నేముంది మరి.

సర్లేండి.. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. ప్రక్కనే అనసూయ ఉండగా.. అదా శర్మ ఏ మాత్రం సీన్‌ లో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ కాగలదు? ఎందుకంటే అనసూయ కు ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి. అసలు నటిగా ఆమె ఏ మాత్రం ప్రూవ్‌ చేసుకోకపోయినా కూడా.. ఈ సినిమాలో ఏదో చేసేయబోతోంది అంటూ అందరూ ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. ఈ విషయం గురించి చెప్పమంటే.. అదా శర్మ ఏమన్నదంటే.. ''అనసూయ చాలా బ్యూటిఫుల్ తన పాత్ర పరంగా చాలా చక్కగా యాక్ట్ చేసింది. తను రియల్లీ టాలెంటెడ్ పర్సన్'' అని చెబుతూనే.. ''అసలు నేను, అనసూయ కలిసి యాక్ట్ చేయలేదు'' అని సెలవిచ్చింది.

సరిపోయింది పోండి. అనసూయతో సీన్లే లేనప్పుడు ఇంక ఈ అమ్మడు పెద్దగా వర్రీ అయ్యేదేం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎలాంటి గ్లామర్‌ పాత్రలు చేసినా కూడా గరంగరంగా అవి బాక్సాఫీస్‌ దగ్గర తుస్సుమన్నాయ్‌. సో.. ''క్షణం''తో అదా శర్మకు ఒక హిట్టు రావాలని కోరుకుందాం.
Tags:    

Similar News