అమ్మ బాబోయ్.. RGV కళాఖండం'రీ రిలీజ్'

Update: 2022-09-27 16:52 GMT
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. మొదట్లో తన మేకింగ్ తో సరి కొత్త ట్రెండ్ సెట్ చేసి ఆయన ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను కూడా క్రియేట్ చేశాడు. అతని నుంచి ఒక సినిమా వస్తుంది అంటే తప్పకుండా అందులో ఏదో ఒక సీరియస్ అంశం ఉంటుంది అని అప్పట్లో ప్రేక్షకుల్లో ఒక బలమైన నమ్మకం ఉండేది. థ్రిల్లర్ అయినా హారర్ అయిన వర్మ తరహాలో ఎవరు కూడా అలాంటి సినిమాలు చేయలేదు.

ఇండియన్ సినిమాలో వర్మ క్రియేట్ చేసిన సెన్సేషన్స్ గురించి ఎంతో చెప్పుకున్న తక్కువే. అయితే ఇదంతా కూడా ఒకప్పుడే. గత పదేళ్ళ కాలంలో చూసుకుంటే వర్మ తీసిన కళాఖండాలను గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అతను స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయిన సినిమాల సంఖ్య అయితే దాదాపు 50 కి పైగానే ఉండవచ్చు. అయితే వర్మ ఇప్పుడు కొనసాగుతున్న రీ రిలీజ్ ట్రెండ్ పై సెటైర్ వేయాలనుకున్నాడో ఏమో ఒక పాత సినిమాను మళ్ళీ థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రచారం స్టార్ట్ చేశాడు.

ఇక ఆ సినిమా అప్పుడు సక్సెస్ కాలేదు ఇప్పుడు సక్సెస్ అవుతుంది అనుకున్నాడు ఏమో తెలియదు కానీ మొత్తానికి రీ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. 2012లో నితిన్ తో చేసిన హిందీ తెలుగు బైలాంగ్యువల్ మూవీ 'అడవిలో' అనే సినిమాను ఇప్పుడు రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. నిషా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పూర్తిగా అడవిలో ఓ కనిపించని అంతకుడు చేసే హత్యల నడుమ కొనసాగుతుంది. ఇక ఆ సినిమాను చాలా సస్పెన్స్ తోనే ముగించారు.

అయితే ఈ సినిమా వచ్చినట్లు కూడా ఇప్పటివరకు చాలామందికి తెలియదు. ఇక అలాంటి సినిమాను వర్మ రిలీజ్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో హడావిడి మొదలుపెట్టారు. అతని కెరీర్లో శివ, గాయం, సత్య, సర్కార్ క్షణక్షణం, రక్త చరిత్ర, కంపెనీ, బూత్ ఇలా ఎన్నో విభిన్నమైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేసినప్పటికీ అలాంటి సినిమాలు విడుదల చేయకుండా ఇలాంటి ఫ్లాప్ సినిమాను ఎందుకు విడుదల చేస్తున్నారు అనేది వారికి తెలియాలి.

పోనీ ఆ అడవిలో సినిమా అప్పుడు ఏమైనా సక్సెస్ అయింది అంటే అది లేదు. అసలు ఆ సినిమా అప్పట్లోనే అతిపెద్ద డిజాస్టర్. ఇక ఇప్పుడు ఇలాంటి సినిమా విడుదల చేస్తే వర్మకు పోయేదేమి లేదు కానీ.. వరుస అపజయలతో సతమతమవుతున్న నితిన్ తల పట్టుకోవాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News