ఈ టైటిల్స్ ఎవరి కోసమో?

Update: 2017-12-31 06:00 GMT
ఫిలిం చాంబర్ లో కొత్త కొత్త టైటిల్స్ ఏం రిజిస్టర్ అవుతున్నాయి అనే దాని మీద మీడియా కన్ను మాత్రమే కాదు దర్శక నిర్మాతల చూపు కూడా ఉంటుంది. కాని కొన్నిసార్లు మాత్రం అవి ఎవరి కోసం రిజిస్టర్ అయ్యయో వాటిని ఎవరి కోసం వాడతారో మాత్రం క్లారిటీ ఉండదు. గతంలో ఒక హీరో కోసం అనుకున్న టైటిల్ ని వేరే హీరో అడిగితే ఇచ్చేసిన సంఘటనలు కూడా చూసాం. పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు టైటిల్ ముందు సప్తగిరిది. ఆ పేరు మీద ప్రమోషన్ మెటీరియల్ - టీజర్ కట్ చేసాక పవన్ అడిగారు అనే ఒకే ఒక్క కారణంతో తమ పేరును మార్చుకుంది ఆ సినిమా యూనిట్. అదే సప్తగిరి ఎక్స్ ప్రెస్. మహేష్ ఖలేజా - కళ్యాణ్ రామ్ కత్తి లాంటి సినిమాలన్నీ ఇలాంటి విషయాల్లో చిక్కులు కూడా ఎదుర్కున్నాయి. తాజాగా ఫిలిం చాంబర్ లో ఉన్న కొన్ని టైటిల్స్ ని గమనిస్తే అవి ఎవరి కోసమో అనే అంచనాలు వేసుకోవచ్చు.

వారాహి బ్యానర్ అధినేత సాయి కొర్రపాటి ఏడాది క్రితమే ‘రానే వచ్చాడు ఆ రామయ్య’’ అనే పేరు రిజర్వ్ లో ఉంచారు. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కోసం వాడాలి అనేది ఆయన ఆలోచన. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ప్రభాస్ పెదనాన్న ఒక్క అడుగు - దందా అనే రెండు టైటిల్స్ తనకోసం అట్టి పెట్టుకున్నారు. అందులో ఒకటి ప్రభాస్ తో తీయాలి అని ప్లాన్. ఇప్పటిలో జరిగే సూచనలు కనిపించడం లేదు. నిర్మాత అశ్విని దత్ జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ప్లాన్ చేసి పేరు కూడా రిజిస్టర్ చేసారు. దానికి కథ రాసి టేకప్ చేసేంత సత్తా ఉన్న దర్శకుడు ఆయనకు ఇంకా తారసపడలేదు. అడవిరాముడు పేరు మరోసారి రిజిస్టర్ అయ్యుంది. స్వర్గీయ ఎన్టీఆర్ - ప్రభాస్ హీరోలుగా ఈ పేరుతో సినిమాలు వచ్చాయి. రానా నటిస్తున్న హింది సినిమా హాతీ మేరి సాతి డబ్బింగ్ వెర్షన్ కోసం ఇది చేసినట్టు టాక్. సాయి ధర్మ తేజ్-వివి వినాయక్ కాంబో కోసం ధర్మా భాయ్ - ఇంటెలిజెంట్ అనే పేర్లు పరిశీలనలో ఉంటే మొదటిది అఫీషియల్ గా నమోదు చేసినట్టు తెలుస్తోంది.

వీటి సంగతి పక్కన పెడితే సినిమాకు తగ్గ పేరు పెట్టడం దర్శకనిర్మాతలకు అగ్నిపరీక్షలా మారుతోంది. మొన్న సునీల్ 2 కంట్రీస్ కంటెంట్ పరంగా ఎంత దారుణంగా ఉన్నా కనీస ఓపెనింగ్స్ రాకపోవడానికి టైటిల్ కూడా ఒక కారణంగా చెబుతున్నారు. సో సినిమా తీయటం ఎంత ముఖ్యమో దానికి సరితూగే టైటిల్ సెలెక్ట్ చెసుకుని రిజిస్టర్ చేసి పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం .
Tags:    

Similar News