పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం ''భీమ్లా నాయక్''. సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇప్పటికే విడుదలైన స్పెషల్ పోస్టర్స్ - టీజర్స్ - సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ క్రమంలో 'అడవి తల్లి మాట' అనే మరో గీతాన్ని విడుదల చేస్తున్నారు.
నిజానికి ఈ పాటను నవంబర్ 30వ తేదీ విడుదల చేయాల్సింది. కానీ అదే రోజున సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఇప్పుడు నాలుగో పాటకు చిత్ర బృందం ముహూర్తం ఫిక్స్ చేసింది. రేపు (డిసెంబర్ 4) ఉదయం 10.08 గంటలకు ఈ విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది.
'భీమ్లా నాయక్' సారాంశం ఏంటో 'అడవి తల్లి మాట' తెలియజేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ - రానా లకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన పోస్టర్ ని వదిలారు. ఇన్నాళ్లూ పోస్టర్లు టీజర్లలో ఇద్దరినీ విడివిడిగా చూపించిన చిత్ర బృందం.. ఇప్పుడు ఒకే ఫ్రేమ్ లో భీమ్లా నాయక్ - డేనియల్ శేఖర్ ల యాటిట్యూడ్ ని చూపించారు. ఇందులో రానా ఇంటెన్స్ గా చూస్తూ ఉండగా.. రానా వైపు పవన్ కోపంగా చూస్తూ నిలబడ్డారు.
సమజ్జీవులైన ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అహం - ఆత్మాభిమానం వల్ల వారి జీవితాల్లో ఏర్పడిన పరిస్థితులను ''భీమ్లానాయక్'' సినిమాలో చూపించబోతున్నారు. ఇది మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. కాకపోతే తెలుగులో పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని చాలా మార్పులు చేర్పులు చేశారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ని జత చేయడంతో పాటుగా పాటలు జోడించారు.
థమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం సమకూర్చారు. ఇప్పటికే వచ్చిన 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ - 'లాలా భీమ్లా' - 'అంత ఇష్టం' పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించాయి. ఈ క్రమంలో రాబోతున్న 'అడవి తల్లి మాట' పాట ఎలా ఉంటుందో చూడాలి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.