అద్బుతాన్ని వెండితెరపై చూడలేమట!

Update: 2021-09-11 00:30 GMT
కరోనా సమయంలో తేజ సజ్జ నటించిన జాంబీరెడ్డి మరియు ఇష్క్ సినిమాలు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. జాంబీరెడ్డి సినిమా మొదటి వేవ్ తర్వాత విడుదల అయ్యింది. కరోనా భయం తగ్గకున్నా కూడా జనాలు జాంబీరెడ్డిని చూసేందుకు థియేటర్లకు వచ్చారు. జాంబీరెడ్డి ఇచ్చిన ఊపుతో ఇష్క్‌ సినిమా తో సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్ల ద్వారానే వచ్చాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన తేజ సజ్జ తాజా చిత్రం 'అద్బుతం'ను మాత్రం థియేటర్‌ రిలీజ్ కు కాకుండా ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ ఈ సినిమా స్ట్రీమింగ్‌ రైట్స్ కోసం ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేసింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

అద్బుతం సినిమాకు థియేట్రికల్‌ బిజినెస్ సరిగా కాకపోవడం వల్ల ఓటీటీకి వెళ్తున్నారు అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాని ఆ విషయం నిజం కాదని థియేటర్లలో విడుదల చేయాలంటే పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిని దాటుకుని రావాలంటే చాలా సమయం పట్టేలా ఉందని.. అందుకే తప్పనిపరిస్థితుల్లో ఓటీటీ ద్వారా పరేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా మేకర్స్ అనఫిషియల్‌ గా మీడియా మిత్రుల వద్ద చెబుతున్నారట. త్వరలోనే మరింత స్పష్టత ఇచ్చేందుకు గాను మీడియా ముందుకు కూడా వస్తారని తెలుస్తోంది.

పెళ్లి గోల అనే వెబ్‌ సిరీస్ ను తెరకెక్కించిన దర్శకుడు మల్లిక్ రామ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తేజ సజ్జకు జోడీగా ఈ సినిమాలో రాజశేఖర్‌ కూతురు శివాని నటించడం ప్రత్యేకమైన విషయం. తప్పకుండా ఈ సినిమా ఆమెకు మంచి ఎంట్రీని ఇస్తుందనే నమ్మకం అందరు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా తమ మొదటి సినిమా థియేటర్ల ద్వారా విడుదల కావాలని కోరుకుంటారు. అలాగే శివాని కూడా తన సినిమా అద్బుతం థియేటర్ల ద్వారా వస్తే ఆనందించేది. కాని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల థియేటర్ల ద్వారా కాకుండా ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం అందుతోంది. ఓటీటీ ద్వారా విడుదల అయిన సినిమాలకు కూడా మంచి ఆధరణ ఉంది. కనుక కంటెంట్‌ ఉంటే ఖచ్చితంగా మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. అందుకే అద్బుతం సినిమా విజయం సాధిస్తే ఇద్దరికి కూడా టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందనే అభిప్రాయంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అద్బుతం ఓటీటీ విడుదల విషయంలో స్పష్టత ఇస్తారేమో చూడాలి.
Tags:    

Similar News