కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ ఉన్నప్పట్టికీ అది అందరికీ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆసుపత్రిలో బెడ్స్ లేక, ఆక్సిజన్ కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సినీ ఇండస్ట్రీ ప్రభుత్వాలను ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ రావు సినీ ఇండస్ట్రీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన హీరోలు సినిమాల్లోనే హీరోయిజం చూపిస్తారని.. రియల్ గా చూపించడం తెలియదని కామెంట్స్ చేశారు.
అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ''మన హీరోలు కట్ కాపీ పేస్ట్ టైప్ ఉంటారు. కానీ ఇప్పుడు అది కూడా లేదు. హీరోయిజం అనేది కేవలం సినిమాల్లో చూపించడమే వీరికి తెలుసు. రియల్ గా చూపించడం తెలియదు. విలన్ గా నటించే సోనూసూద్ తన చారిటీతో ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మనసులను గెలిచాడు. తన సేవా కార్యక్రమాలతో అమితాబ్ బచ్చన్ - షారుఖ్ ఖాన్ - అక్షయ్ కుమార్ వంటి హీరోల కంటే సోనూసూద్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అది రియల్ హీరోయిజం'' అన్నారు.
''మన హీరోలు తీవ్ర పరిస్థితుల్లో కూడా ప్రశ్నించ లేకపోతున్నారు.. సమస్యను కూడా గుర్తించడం లేదు. ప్రశ్నించే వాళ్లు హీరో సిద్ధార్థ్ లాగా ఉంటారు.. సమస్యని గుర్తించిన వాళ్ళు సోనూసూద్ లాగా ఉంటారు. కేవలం సినిమాలకే పరిమితమై రాజకీయాలు మనకెందుకులే, ప్రజలు ఎటుపోతేనేం అనేలా వ్యవహరిస్తున్నారు. ప్రజలు మీకోసం చెమటలు కక్కుకొని కష్టపడి థియేటర్ కు వచ్చి మిమ్మల్ని హీరోలు చేశారు. ప్రభుత్వాలని ప్రశ్నిస్తే చనిపోతారా?. మహా అయితే ప్రభుత్వాలు స్పందిస్తాయి'' అని దయాకరరావు చెప్పుకొచ్చారు.
నిజానికి గతేడాది కరోనా మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి సినీ ఇండస్ట్రీ ప్రజలకు తమకు తోచిన విధంగా అండగా నిలుస్తూ వచ్చారు. సెకండ్ వేవ్ సమయంలో కూడా ఎప్పటికప్పుడు జనాలను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్స్ కోసం సహాయం చేస్తున్నారు. ఫండ్స్ రైజ్ చేయడమే కాకుండా.. సోషల్ మీడియాలో ఆసుపత్రులలో బెడ్స్ గురించి సమాచారం అందిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వాని సమస్య తీవ్రతను వివిధ మధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పటికే వారికి తోచిన సాయం చేశారు.. చేస్తూనే ఉన్నారు. ఇంతకముందు విపత్తుల సమయంలో కూడా టాలీవుడ్ అండగా నిలిచింది. అయినా సరే ప్రతిసారి సినీ సెలబ్రిటీలనే ఎందుకు టార్గెట్ చేస్తుంటారని.. రాజకీయ నాయకులు చేయాల్సిన పనులకి కూడా హీరోలను సాఫ్ట్ టార్గెట్ చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.