రావ‌ణుడిపైనే కాదు హ‌నుమంతుడిపైనా పంచ్ లు!

Update: 2022-10-10 00:30 GMT
ప్రపంచ ప్ర‌సిద్ధిగాంచిన పౌరాణిక ఇతిహాసం రామాయ‌ణంపై సినిమా తీయ‌డం అంటే అది ఒక పెను స‌వాల్ లాంటిది. శ్రీ‌రాముడు - సీతాదేవి- ఆంజ‌నేయుడు- రావ‌ణుడు వంటి పాత్ర‌ల‌ను ప్ర‌జ‌లు మెచ్చేలా తీర్చిదిద్ద‌డం అన్న‌ది ద‌ర్శ‌కుడికి ఠ‌ఫ్‌ టాస్క్. పురాణేతిహాసాల‌పై అపార ప‌రిజ్ఞానం ఉన్న పండితులెంద‌రో మ‌న‌కు ఉన్నారు. వారి నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంది. ఎక్క‌డ తేడా వ‌చ్చినా విమ‌ర్శ‌లు ఘాటుగానే వినిపిస్తాయి. ఓంరౌత్ ఆదిపురుష్ టీజ‌ర్ రిలీజ్ కాగానే ఇలాంటి విమ‌ర్శ‌లు వెల్లువ‌లా వ‌చ్చాయి.

ముఖ్యంగా ఇందులో పాత్ర‌ల‌ను చూపించిన తీరును నాశిర‌కం వీఎఫ్ ఎక్స్ ను  ప‌లువురు తీవ్రంగా విమ‌ర్శించారు. ముఖ్యంగా రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ గెట‌ప్ ని థోర్ వంటి పాత్ర‌ల‌తో పోల్చ‌డ‌మే గాక తీవ్రంగా విమ‌ర్శించారు. అయితే పై విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్టేందుకు ప్ర‌భాస్ - ఓంరౌత్ బృందం ఇంత‌కుముందు మీడియా స‌మావేశం కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ వేదిక‌పై నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ మొబైల్ లో విజువ‌ల్ వీక్ష‌ణ వేరు. పెద్ద తెర‌పై వీక్ష‌ణ వేరు. ఆదిపురుష్ పెద్ద తెర‌పై చూడాల్సిన సినిమా. అది కూడా 3డిలో ఎంతో అద్భుతంగా ఉంటుంద‌ని స‌మ‌ర్థించారు. బాహుబ‌లి వంటి సినిమా రిలీజైన‌ప్పుడు ప్ర‌భాస్ శివ‌లింగం ఎత్తే స‌న్నివేశాన్ని ఇలానే విమ‌ర్శించార‌ని కూడా తెలిపారు.

తాజాగా ఓం రౌత్ తన సినిమాలో రావణ్ గా సైఫ్ రూపాన్ని సమర్థించాడు.
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీ‌రాముని రూపానికి విమ‌ర్శ‌లు లేవు. కృతి సనన్ సీత‌గా ఓకే అనిపించింది. సైఫ్ అలీ ఖాన్ లంకేష్‌ పాత్ర వివాదానికి కార‌ణ‌మైంది. ఈ చిత్రం టీజర్ లో పేలవమైన VFX ట్రోలింగుకి కార‌ణ‌మైంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా హనుమంతుడిని తోలు వేషంలో చిత్రీకరించడాన్ని వ్యతిరేకించారు.  సైఫ్ అలీ ఖాన్ రావణ్ గా కనిపించడాన్ని ఇంటర్నెట్ లో ఒక వర్గం ప్రజలు ట్రోల్ చేయ‌గా ఆంజ‌నేయుని పాత్ర‌పై రాజ‌కీయ నాయ‌కుడు అలా విమ‌ర్శించారు. దీనికి చిత్ర దర్శకుడు ఓం రౌత్ చిత్రణ తన సృజనాత్మక ఎంపికను సమర్థించుకున్నారు.

ఓంరౌత్ వివ‌ర‌ణ ఇస్తూ ఇలా అన్నారు. ``నేటి కాలంలో మన రావణుడు రాక్షసుడు.. అతను క్రూరమైనవాడు. మన దేవత అయిన సీతను అపహరించిన వాడు క్రూరుడు. రావణుడు ఎలా ఉంటాడో మేము చూపించాము. నేటి సమయంలో ఇలా ఉన్నాడు అని చూపాం. ఇది మాకు సినిమా లేదా ప్రాజెక్ట్ కాదు. మొత్తం నిర్మాణ బృందానికి `మిషన్`!`` అని అన్నారు. ఈ చిత్రం మా భక్తికి చిహ్నం. దీనికి అందరి ఆశీర్వాదాలు అవసరం. సినిమా గురించి ఎవరు మాట్లాడినా వింటున్నాను. ప్రతిదీ గమనిస్తున్నాను. జనవరి 2023లో మీరు సినిమాను చూసినప్పుడు ఎవరినీ నిరాశపరచము`` అని అన్నారు. రావ‌ణుడిపైనే కాదు హ‌నుమంతుడిపైనా పంచ్ లు! త‌ప్ప‌డం లేదు. ప్ర‌తిదానికి ఓంరౌత్ వివ‌ర‌ణ ఇస్తున్నారు. ఈ చిత్రం 2023 జనవరి 12న‌ థియేటర్లలోకి రానుంది.
Tags:    

Similar News