'ఆదిపురుష్‌' హాలీవుడ్ రేంజ్ విజువల్ ట్రీట్‌

Update: 2021-10-06 02:30 GMT
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ ఓమ్‌ రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ మూవీ ఆదిపురుష్‌. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా నెలలు అయ్యింది. కాని కరోనా వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. షూటింగ్ ఆలస్యం అయినా విడుదల విషయంలో ఎలాంటి మార్పు లేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు మరోసారి ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. 400 కోట్ల బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా లో విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్‌ సినిమాల రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. ఇప్పటి వరకు ఇండియన్‌ సినీ చరిత్రలో అత్యధిక వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉన్న బాహుబలి 2 సినిమా నిలిచింది. కాని ఇప్పుడు ఆదిపురుష్‌ అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుంది. రికార్డు బ్రేకింగ్‌ బడ్జెట్‌ తో రూపొందబోతున్న ఈ సినిమా రామాయణ ఇతివృత్తంతో రూపొందుతున్న విషయం తెల్సిందే.

రాముడిగా ప్రభాస్‌ నటిస్తుండగా రావణాసూరుడిగా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నాడు. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల ప్రముఖ నటీనటులను ఈ సినిమాలో చూపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా బాహుబలి 2 కు నాలుగు రెట్ల విజువల్‌ ట్రీట్ ఇస్తుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్ సంస్థలు ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ కోసం వర్క్‌ చేస్తున్నాయి. దాదాపుగా రెండు వందల కోట్లు వీఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం వినియోగిస్తున్నారు అంటూ బాలీవుడ్‌ మీడియా వర్గాల్లో కూడా టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న వీఎఫ్‌ఎక్స్‌ ప్రొఫెషనల్స్ ఈ సినిమాను హాలీవుడ్‌ మూవీ రేంజ్ లో నిలుపుతారని అంటున్నారు.

ఆదిపురుష్‌ కు ముందు ప్రభాస్ రాధే శ్యామ్‌ సినిమాతో రాబోతున్నాడు. అంతే కాకుండా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌ సినిమా కూడా వచ్చే సమ్మర్ లో రాబోతుందని అంటున్నారు. ఒక వేళ ఆ తేదీ మిస్ అయితే ఆదిపురుష్‌ తర్వాత వచ్చే దసరా పండుగ సందర్బంగా సలార్‌ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ కు ఆదిపురుష్‌ తో పాన్‌ వరల్డ్‌ స్టార్‌ డమ్ రావడం ఖాయం అని.. ఆ తర్వాత ప్రభాస్‌ నుండి వచ్చే సినిమాలను హాలీవుడ్‌ ప్రేక్షకులు ఖచ్చితంగా ఆధరిస్తారు అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఆదిపురుష్‌ తర్వాత ఇండియన్ సినిమా రేంజ్ మారిపోతుంది. ఖచ్చితంగా హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ నుండి ప్రేక్షకుల వరకు అంతా కూడా ముక్కున వేలేసుకుని మరీ ఇండియన్ సినిమాల వైపు చూస్తారు అనేది అందరి నమ్మకం.
Tags:    

Similar News