కరోనా ఉపద్రవం మరోసారి సినీ రంగాన్ని బలంగా తాకింది. ఈ దెబ్బకు సినీ కార్యకలాపాలతోపాటు సాధారణ వ్యాపారాల వరకూ అన్నీ మూతపడ్డాయి. మహారాష్ట్రలో కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి అంతకంతకూ పెరుగుతుండడంతో.. సినిమా షూటింగుల నుంచి థియేటర్ల వరకు అన్నీ మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఒక రకంగా అక్కడ లాక్ డౌన్ విధించినట్టే లెక్క. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు పార్కులు, జిమ్ సెంటర్లు, సినిమా థియేటర్లు అన్నీ క్లోజ్ చేయాలని ఆదేశించింది. బుధవారం రాత్రి ఈ ఆదేశాలు జారీచేసిన సర్కారు.. తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. మే 1వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
దీంతో.. ఆదిపురుష్ చిత్రం షూటింగ్ ఆపేయడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. కాగా.. నిన్నామొన్నటి వరకు ఆదిపురుష్ టీమ్ లో కొందరికి కరోనా వచ్చిందని, అందువల్ల షూటింగ్ ఆగిపోయిందని రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అలాంటిదేమీ లేదని, షూటింగ్ కొనసాగుతోందని క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ఓం రౌత్.
ఇప్పుడు.. స్వయంగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో నిజంగానే షూటింగ్ నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో... ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. సీతగా కృతిసనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ చిత్రాన్ని రిల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.