సెట్లో ఫైర్.. హీరోయిన్ సేఫ్

Update: 2017-06-17 13:20 GMT
సాధారణంగా ఔట్ డోర్ షూటింగ్లు జరుగుతున్నప్పుడు చాల ప్రమాదాలు జరుగుతుంటాయి. అలా జరగడం వలన కొందరు ఈ లోకం నుండి వెళ్లిపోవలిసి వచ్చింది కూడా. కొందరు కెరియర్ ను పక్కన పెట్టవలిసి వచ్చింది. కానీ ఇప్పుడు ఒక చరిత్రలో మిగిలిపోయిన ప్రమాదంలో నుండి పుట్టిన ప్రేమ గురించి చెప్పాలి. మదర్ ఇండియా షూటింగ్ సమయంలో నర్గీస్ ఒక అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు అక్కడే ఉన్న సునిల్ దత్త్ (సంజయ్ దత్త్ వాళ్ళ నాన్న) వచ్చి రక్షించారు ఆ తరువాత వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇలానే జరగవలిసింది కానీ అలా జరగలేదు.

మణిరత్నం ‘చెలియా’లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది అదితి రావు హైదరి. ఇప్పుడు ఈమె వరస రెండు అగ్ని ప్రమాదాలు నుండి తప్పించుకొని  బయటపడింది. రెండు ప్రదేశాలు కూడా సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు జరిగినివే. సంజయ్ దత్త్ నటిస్తున్న ‘భూమి’ సినిమా షూటింగ్లో ఒక టెలివిజన్ రియాలిటీ షూ సెట్ నిర్మిస్తున్నప్పుడు అక్కడ ఉన్న స్టేజ్ పైకి వచ్చి అదితి నటించవలిసి ఉంది. ఆమె రావడానికి కొద్ది నిముషాలు ముందే అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టం కొద్ది ఆ ప్రమాదం నుండి అమ్మడు బయటపడింది. మళ్ళీ మొన్ననే ఆర్‌ కే స్టూడియోలో ఒక పెళ్లి సన్నివేశం జరుగుతున్నప్పుడు మరోసారి అగ్ని ప్రమాదం జరిగి అక్కడ ఉన్న డెకరేషన్ వస్తువులు సెట్ డిజైన్ వస్తువులు మంటలో పడిపోయాయి కానీ అక్కడ పని చేస్తున్న వాళ్ళకు ఏమి కాకపోవడంతో ఎవరు అంతా టెన్షన్ పడలేదు. కానీ సెట్ మొత్తం చాలా  విషాదంలో మునిగిపోయిందని అదితి చాలా బాధతో చెప్పింది.

''నేను రెండు సార్లు కూడా చాలా  లక్కీ గా తప్పించుకున్నాను. లేకపోతే నన్ను ఎవరో వచ్చి కాపాడవలిసి వచ్చేది. అప్పటిలో నర్గీస్ గారిని సునిల్ దత్త్ కాపాడినట్లు. మరో విషయం చెప్పనా అప్పుడు ఆ సెట్లో సంజయ్ కూడా లేడు.. నన్ను కాపాడడానికి'' అని జోక్ చేసింది. మొత్తానికి ఈ సొగసరికి అగ్ని ప్రమాదాలు రెండు తప్పించుకొని బయట పడటం అక్కడ ఉన్న ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పిల్లుచుకున్నారులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News