కొత్త హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేయడంలో వెంకటేష్ కు చాలానే గుర్తింపు ఉంది. అనేక సినిమాలతో కొత్త హీరోయిన్స్ ను టాలీవుడ్ కి తీసుకొచ్చిన ఘనత వెంకీదే. బాలీవుడ్ భామలతో తెలుగు సినిమాలు చేయించిన రికార్డ్ కూడా ఉంది. కానీ ఇదంతా గతం. ప్రస్తుతం సీనియర్లకు హీరోయిన్స్ దొరకడం క్లిష్టంగా మారిందంటూ వెంకీ ఓపెన్ గానే ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
ఇక విషయానికి వస్తే.. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి.. ఆట నాదే- వేట నాదే అనే టైటిల్ ను అనుకుంటున్నారనే టాక్ ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీకి.. హీరోయిన్ ను ఫైనలైజ్ చేశారట. మణిరత్నం మూవీ చెలియాలో నటించి.. మూవీ సక్సెస్ సాధించకపోయినా.. అందంతో అందరినీ మెప్పించిన అదితి రావు హైదరిని.. ఫైనలైజ్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే అగ్రిమెంట్స్ వ్యవహారం కూడా పూర్తయిపోయిందని.. త్వరలోనే మేకర్స్ నుంచి ఈ విషయంపై అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తోంది. ఈ న్యూస్ ఖాయం అయితే మాత్రం.. తెలుగులో అదితికి ఇది రెండో ముూవీ అవుతుంది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందిస్తున్న ఓ సినిమాలో నటిస్తోంది అదితి రావు హైదరి. ఇప్పుడు వెంకీ సినిమా ద్వారా రెండో తెలుగు ప్రాజెక్టుకు అదితి సైన్ చేసిందన్న మాట.