ఫోటో స్టోరీ: ఇలాంటి ట్రాలెవర్ ఉంటేనా

Update: 2016-12-13 03:52 GMT
హైద్రాబాదీ భామే అయినా అదితి రావు హైదరి ఇప్పటివరకూ టాలీవుడ్ సినిమాల్లో మాత్రం కనిపించలేదు. అలాగని ఇక్కడి జనాలకు పెద్దగా దూరమయిపోనూ లేదు. అప్పుడప్పుడు హైద్రాబాద్ వాసులను నేరుగా పలకరిస్తూనే.. ఫోటో షూట్స్ గట్రా లాంటి వాటితో అందరి మనసుల్లోను నాటుకుపోయింది.

తాజాగా ఈ భామ ట్రావెలర్ మేగజైన్ కోసం ఓ ఫోటో షూట్ చేసింది. ఓ చెక్క పడవలో పక్కనే తెడ్డు పెట్టుకుని.. ఒంటరిగా ఎవరికోసమో ఎదురుచూస్తోంది అదితి. పచ్చని అందాల నడుమ పడవలో ఇలాంటి అందమైన పాప ఎదురుచూస్తుంటే.. ఎవరి మనసైనా పాపం చివుక్కుమనక మానదు. ఇంతకీ అదితి వెయిటింగ్ సరే కానీ.. వస్త్రధారణలో మాత్రం తన స్థాయిని చూపించింది. వేసీ వేయనట్టుగా ఉన్న ఆ డ్రస్.. సైడ్ యాంగిల్ లో అసలు కనిపించనా వద్దా అన్నట్లుగా ఉంది పాపం.

బ్యాక్ లెస్ అందాలను సైడ్ యాంగిల్ లోంచి చూపిస్తూ.. చేతులు కట్టుకుని మరీ ఎక్కడికో ప్రయాణం అయినట్లుంది ఈ బ్యూటీ. ఇంతకీ ఇలాంటి ట్రావెలర్ తో ప్రయాణం చేసే ఆ అదృష్టం ఎవరిదో కదా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News