టాలీవుడ్ ఇండస్ట్రీలో 'అల వైకుంఠపురంలో' మూవీ సక్సెస్ ప్రభావం ఇంకా ఆగిపోలేదని అనిపిస్తుంది. ఎందుకంటే.. ఇప్పటికే ఆ మూవీతో అటు హీరో హీరోయిన్లకు, ఇటు డైరెక్టర్ నిర్మాతలకు అందరికి రావాల్సిన ఫేమ్, నేమ్ వచ్చేసాయి. అయితే ఇప్పుడు తాజాగా 'అల వైకుంఠపురంలో' మూవీ పాటల ఆల్బమ్ విడుదల చేసిన ఆదిత్య మ్యూజిక్ కంపెనీ పేరిట కొత్త రికార్డు నమోదు అయింది. నిజానికి అల వైకుంఠపురంలో మూవీ తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా తెలుగులోనే కాదు సౌత్ ఇండియాలోనే అగ్రగామి మ్యూజిక్ కంపెనీగా ఆదిత్య మ్యూజిక్ అందరికి పరిచయమే. గత మూడు దశబ్దాలుగా వేల సూపర్ హిట్ ఆడియో ఆల్బమ్ లను తెలుగు శ్రోతలకు ఆదిత్య మ్యూజిక్ అందిస్తోంది. ఆదిత్య మ్యూజిక్ నుంచి ఈ ఏడాది విడుదలైన 'అల వైకుంఠపురంలో' ఆడియో ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకుంది.
ఈ సినిమాలోని పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి. ఇప్పటికే ఈ ఆడియో ఆల్బమ్ వివిధ మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్ లలో రోజుకో రికార్డు క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆదిత్య మ్యూజిక్.. 2020లో అత్యధిక ప్రజాదరణ పొందిన పాటల రైట్స్ దక్కించుకున్న మ్యూజిక్ కంపెనీగా రికార్డులో కెక్కింది. భీష్మ, ఉప్పెన, పలాస, రంగ్ దే, వకీల్ సాబ్ తదితర సినిమాల ఆడియోలు విడుదల చేసిన ఆదిత్య మ్యూజిక్.. కేవలం 'అల వైకుంఠపురంలో' ఆల్బమ్ తోనే దాదాపు 12కోట్ల వరకు లాభాలు సంపాదించుకుందట. అంతేగాక ఆదిత్య మ్యూజిక్ కి సంబందించిన యూట్యూబ్ ఛానల్‌లో 'అల వైకుంఠపురంలో' ఆల్బమ్‌కి బిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. అంటే సుమారు వ్యూస్ సంఖ్య వందల కోట్ల పైనే ఉంటుందని అంచనా. సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ఏ మ్యూజిక్ ఆల్బమ్‌కి కూడా ఒకే ప్లాట్ ఫామ్‌లో ఈ రేంజ్ వ్యూస్ రాలేదు. ఇప్పుడు ఈ బిగ్గెస్ట్ రికార్డు 'అల వైకుంఠపురంలో' సినిమా ఆల్బమ్ కారణంగా ఆదిత్య మ్యూజిక్ సొంతం అయ్యిందని చెప్పాలి.