బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి. 2004,2006 సంవత్సరాల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తనకు మద్యం తాగి శారీరకంగా అనుభవించేందుకు ప్రయత్నించాడని.. ఆ ఫొటోలను బయటపెట్టి బెదిరిస్తున్నాడని బాలీవుడ్ నటి పోలీసుల గడప తొక్కింది. పోలీసులు ఆదిత్య పంచోలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
అయితే కోర్టులో నడుస్తున్న ఈ కేసులో ఆదిత్యా పంచోలికి ఉపశమనం లభించింది. ఈయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ముంబై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు3 వరకు అరెస్ట్ చేయకూడదని ఆదేశించింది.
బాలీవుడ్ ను కుదిపేసి ఈ లైంగిక వేధింపుల కేసులో ఎట్టకేలకు ఆదిత్య పంచోలికి కాసింత ఊరట లభించింది. అయితే తనపై హీరోయిన్ పెట్టిన కేసు తప్పుడు కేసు అని ఆదిత్య పంచోలి తాజాగా స్పందించారు. హీరోయిన్ కావాలనే అభాండాలు వేస్తోందని ఆరోపించాడు.
తానే తప్పు చేయలేదని.. నా వద్ధ ఆధారాలు కూడా ఉన్నాయని ఆదిత్య తాజాగా మీడియాకు వివరణ ఇచ్చారు. పోలీసులకు, విచారణకు తాను సహకరిస్తానని వెల్లడించాడు. బెయిల్ దొరికిన ఆదిత్య నుంచి త్వరలోనే పోలీసులు వాంగ్మూలం తీసుకోనున్నారు. మరి ఈ కేసు కోర్టులో ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది వేచిచూడాలి.