ఎన్నారై అడివి శేష్ ముందుగా అమెరికాలో ఉండి ఆ తరువాత సినిమాల మీద మక్కువతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. మొదట తాను హీరోగా చేసిన కర్మ సినిమాకు తనే దర్శకుడిగా రైటర్ వర్క్ చేసి నలుగురిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత పంజాలో చేసిన పాత్రకి అడివి శేష్ అందరికి బాగా నచ్చేశాడు. అందులో అతను నటనను చూస్తే ఎవ్వరైనా ఫిదా కావలిసిందే.
ఇక ఆ తరువాత కొన్ని సినిమాల్లో విలన్ గా అలా ట్రై చేసి చివరికి ఒక్క క్షణం సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి కూడా మనోడి ఇమేజ్ కి బాగానే ఉపయోగపడింది. అమీతుమీ కూడా మంచి హిట్ అయ్యింది. దీంతో ఫైనల్ గా ఇప్పుడు హీరోగా చేయాలనీ ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం గూఢచారి అనే సినిమాను చేస్తున్నాడు. క్షణం సినిమాకు వర్క్ చేసిన రైటర్స్ ఈ సినిమాకు కూడా వర్క్ చేస్తున్నారు.
అయితే సినిమా ఫస్ట్ లుక్ ని సంక్రాంతి సందర్బంగా జనవరి 14న రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబందించిన పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ఈ విషయాన్ని తెలిపింది. శశికాంత్ టిక్కా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నాడు. దాదాపు సినిమా షూటింగ్ కూడా ఎండింగ్ కు వచ్చేసింది. మార్చ్ లో గాని లేదా ఆ తరువాత గాని సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.