ఒకే ఫ్రేమ్ లో చరణ్, తారక్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..

టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే.

Update: 2024-12-23 14:37 GMT

టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీతో వాళ్ళ ఫ్రెండ్ షిప్ గురించి వరల్డ్ వైడ్ గా రివీల్ అయిపోయింది. ఇద్దరూ అంత క్లోజా అని చాలా మంది షాకయ్యారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఇద్దరూ కలిసి మామూలుగా సందడి చేయలేదు. ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేశారు.

సినిమా రిలీజ్ అయ్యాక అనేక అవార్డులు వేడుకల్లో ఇద్దరూ కలిసి కనిపించారు. ఫ్యామిలీస్ తో కూడా అటెండ్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒకే ఫ్రేమ్ లో కనిపించలేదు. దీంతో ఆ మధ్య.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ టైమ్ లో జరిగిన చరణ్ బర్త్ డే వేడుకకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా.. మళ్లీ ఎప్పుడు అన్నా ఇలా అని నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

అయితే ఇప్పటి వరకు మళ్ళీ చరణ్, తారక్ కలుసుకున్నారో లేదో తెలియదు కానీ.. ఫ్యాన్స్ కు మాత్రం కనిపించలేదు. ఆ మధ్య ఓ సారి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఎదురుపడ్డారు. కానీ ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత ఒకే చోట కనిపించి సందడి చేశారు. వారితో పాటు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైరెక్టర్ బుచ్చిబాబు ఉన్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. తమ సోషల్ మీడియా వాల్స్ లో ఫోటోలు షేర్ చేసుకుంటున్నారు. సూపర్ మూమెంట్ అని సందడి చేస్తున్నారు. అయితే తమన్ తొలుత ఆ పిక్ ను షేర్ చేస్తూ.. డోప్ మూమెంట్.. వాట్ ఏ ఫన్.. బ్రదర్స్ లవ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే చరణ్, తమన్.. రీసెంట్ గా అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.

డల్లాస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వారిద్దరూ యూఎస్ వెళ్లారు. ఇప్పుడు తమన్ పిక్ షేర్ చేయడంతో ఎన్టీఆర్.. అక్కడే ఉన్నారా అని కొందరు క్వశ్చన్ చేశారు. అయితే అమెరికా నుంచి గేమ్ ఛేంజర్ టీమ్ ఇండియా వచ్చేసింది. దీంతో ఎక్కడ కలిశారోనని డిస్కస్ చేసుకున్నారు. ఇంతలో డైరెక్టర్ బుచ్చిబాబు.. కూడా చరణ్, తారక్ తో దిగిన పిక్ ను పోస్ట్ చేశారు.

తన ఫేవరెట్ హీరోస్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో చరణ్, తమన్, బుచ్చిబాబు, తారక్ అంతా దుబాయ్ లోని ఓ ఈవెంట్ లో కలిసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో దిగిన పిక్స్ ను పోస్ట్ చేసినట్లు సమాచారం. సందర్భం ఏదైనా.. తమన్, బుచ్చిబాబు షేర్ చేసిన పిక్స్.. ఇప్పుడు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. అందరినీ అట్రాక్ట్ చేస్తూ సందడి చేస్తున్నాయి.

Tags:    

Similar News