'జాతిని ప్రేమించాను బ్రో'.. అభిమాని బూతుకి అడివి శేష్ జవాబు..!

Update: 2022-06-08 08:30 GMT
సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక కొత్త పదాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు అభ్యంతరకరమైన బూతులను ఉపయోగిస్తున్నారు. మరికొందరు మాత్రం కొన్ని విషయాలను అభినందించడానికి కూడా తరచుగా ఇలాంటి పదాలను వాడుతుండటం మనం చూస్తుంటాం.

ఇప్పుడు తాజాగా హీరో అడివి శేష్ ఓ నెటిజన్ నుంచి వచ్చిన బూతు పదాన్ని సవరించి అందరి దృష్టిని ఆకర్షించారు. శేష్ టైటిల్ రోల్ లో పోషించిన "మేజర్" సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకొని.. నిర్మాతలను ప్రాఫిట్ జోన్ లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో అద్భుతమైన నటన కనబర్చిన శేష్ కు అన్ని వర్గాల ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రతిష్టాత్మక చిత్రాన్ని తన భుజాల మీద వేసుకొని ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు కొనియాడుతున్నారు.

ప్రస్తుతం 'మేజర్' విజయాన్ని ఆస్వాదిస్తున్న శేష్.. వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాదు.. సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం ట్విట్టర్ లో చిట్ చాట్ సెషన్ ను నిర్వహించాడు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పారు.

ఈ క్రమంలో శేష్ అభిమాని ఒకరు 'మేజర్' సినిమాతో సక్సెస్ సాధించినందుకు అభినందనలు తెలుపుతూ "జాతిని దెం**వ్ బ్రో" అని ఓ బూతు పదాన్ని ఉపయోగిస్తూ ట్వీట్ చేసాడు. పాజిటివ్ టెన్స్ లోనే చెప్పినా అది అభ్యంతరకరమైన పదమని అందరికీ తెలుసు. సాధారణంగా ఇలాంటి ట్వీట్స్ ని సెలబ్రిటీలు అవైడ్ చేస్తుంటారు.

కానీ శేష్ మాత్రం దానికి సమాధానమిస్తూ నెటిజన్ కి సర్దిచెప్పాడు. "జాతిని ప్రేమించాను బ్రో" అని ట్వీట్ చేసిన వర్సటైల్ హీరో.. హార్ట్ సింబల్ ఎమోజీ మరియు ఇండియన్ ఫ్లాగ్ లను జోడించారు. శేష్ జవాబు చాలా మంది హృదయాలను గెలుచుకుంది. దీనికి వేల సంఖ్యలో లైకులు రీట్వీట్ లు వస్తున్నాయి.

ఇకపోతే 'మేజర్' సక్సెస్ తర్వాత అడివి శేష్ "హిట్ 2" చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. 'హిట్' (హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్) ఫ్రాంచైజీలో తెరకెక్కిన ఈ సినిమా.. జూలై 29న విడుదల కాబోతోంది. హీరో నాని నిర్మించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఇదే క్రమంలో శేష్ 'గూఢచారి 2' మూవీ పనులు మొదలు పెట్టనున్నారు.
Tags:    

Similar News