పీవీపీ బ్యానర్ లో మరోసారి శేష్!

Update: 2018-08-06 04:23 GMT
విజయానికి ఉన్నంత ప్రాధాన్యం అపజయానికి ఉండదు. అందుకు కారణలేంటని ఉదాహరణలతో వివరించాల్సిన అవసరం లేదు.  ప్రతి శుక్రవారం నాడు ఫిలిం ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారుతుంటాయి. హిట్ సాధించిన వాళ్ళవెంట ఇండస్ట్రీ పడుతుంది... ఫ్లాప్ ఇచ్చిన వాళ్ళను మర్చిపోయే ప్రయత్నం చేస్తుంది.   రీసెంట్ గా 'గూఢచారి'  తో హిట్ సాధించిన అడివి శేష్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ ప్రాపర్టీ గా మారిపోయాడు.

శేష్ ఇప్పటికే నటుడిగానే కాకుండా కథకుడిగా కూడా తన సత్తా చాటుకున్నాడు. 'క్షణం' లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కు స్టొరీ అందించడం ద్వారా  అందరి దృష్టినీ ఆకర్షించాడు. తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కినా  'క్షణం' పీవీపీ సినిమాస్ వారికి మంచి లాభాల్ని తెచ్చి పెట్టింది. దాంతో వారు అడివి శేష్ ను మరో సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నారట.  ఈ సినిమా కూడా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కే ఓ థ్రిల్లర్ అని - రెజినా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం.   అడివి శేష్ ఈ సినిమాకు కథ అందించడం తో పాటు హీరోగా నటిస్తున్నాడట. 

'గూఢచారి' సినిమా విజయంతో శేష్ తదుపరి చిత్రాలపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. దీంతో ఈ సినిమా క్రేజీ ప్రాజెక్ట్ గా మారిపోయింది.  ఈ సినిమాకంటే ముందే '2 స్టేట్స్' తెలుగు రీమేక్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ద్వారా రాజశేఖర్ - జీవితల గారాలపట్టి శివాని హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.  ఈ రెండు సినిమాలు కాకుండా - పలువురు నిర్మాతలు శేష్ కు ఆఫర్లు ఇస్తున్నారట.    'గూఢచారి'  విజయం శేష్ కు మంచి క్రేజ్ ను తెచ్చినట్టే ఉంది.
Tags:    

Similar News