వీడియో: న‌యా కొంటె వింక్ గాళ్

Update: 2020-03-02 10:15 GMT
ఒకే ఒక్క క‌న్ను గీటుడుతో ప్ర‌పంచాన్ని పాదాక్రాంతం చేసుకుంది మ‌ల‌యాళీ బ్యూటీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్. ఏడాది పాటు వింక్ గాళ్ ముచ్చ‌ట త‌ప్ప యూత్ లో ఇంకేదీ వినిపించ‌లేదు. ప్రియా ప్ర‌స్తుతం బాలీవుడ్ స‌హా సౌత్ సినిమాల్లో న‌టిస్తోంది. అది స‌రే కానీ.. ఈ వీడియోలో స‌రికొత్త సెక్సీ వింక్ గాళ్ ని చూశారు క‌దా!

ఈ డైన‌మిక్ వింక్ బ్యూటీ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కుర్రాళ్ల గుండెల్ని క‌రోనాలా ప‌ట్టేసిన అందాల కియ‌రా అద్వాణీ. వ‌రుస‌గా క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ వంద‌శాతం స‌క్సెస్ రేటు ఉన్న నాయిక‌గా వెలిగిపోతోంది. ఎపుడో విన‌య విధేయ రామ మిన‌హా అన్నీ హిట్ చిత్రాలే. మ‌రోవైపు వేడెక్కించే వెబ్ సిరీస్ ల‌తోనూ మంట‌లు పెట్టేస్తోంది.

ప్ర‌స్తుతం ఇర్ఫాన్ న‌టించిన‌ `అంగ్రేజీ మీడియం` రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రానికి యువ‌క‌థానాయిక‌ల‌తో వీడియో ప్ర‌మోష‌న్ చేయిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. తాజాగా సోష‌ల్ మీడియాలోకి కియ‌రా ఓ వీడియోని పోస్ట్ చేసి గిలిగింత‌లు పెట్టేస్తోంది. ఈ వీడియోలో కియ‌రా కొంటెగా క‌న్ను గీటి క‌వ్విస్తోంది. క‌నుబొమ్మలు ఎగుర‌వేసి కుర్రాళ్ల‌ను క్లీన్ బౌల్డ్ చేసేస్తోంది. ఇంత‌గా క‌వ్విస్తే సినిమా హిట్టే. అంగ్రేజీ మీడియం టీమ్ ఇలా భామ‌ల్ని ఉప‌యోగించి ఉచిత ప‌బ్లిసిటీ బాగానే కొట్టేస్తోంది. ఇక కియ‌రాతో పాటు జాన్వీ క‌పూర్- అహ‌నా పాండే కూడా ఇన్ స్టాల్లో ఈ త‌ర‌హా వీడియోల‌తో కవ్విస్తూ అంగ్రేజీ మీడియంకి ప్ర‌చారం చేస్తున్నారు. యూత్ లో క్రేజీ ఫాలోయింగ్ ఉన్న భామ‌లు కాబ‌ట్టి.. వీడియోలు అంతే జోరుగా వైర‌ల్ అయిపోతున్నాయి. 2017 కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ హిందీ మీడియం త‌ర‌హాలోనే అదే జోన‌ర్ లో వ‌స్తున్న అంగ్రేజీ మీడియంలో ఇర్ఫాన్ ఖాన్- క‌రీనాక‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News