ఆ రెండూ బాక్సాఫీస్‌ ని కుమ్మేస్తున్నాయ్

Update: 2016-11-02 11:30 GMT
బాలీవుడ్ లో ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ కావడం పెద్ద విశేషమేమీ కాదు కానీ.. రెండింటికీ మంచి టాక్ రావడం.. రెండూ చిత్రాలు పోటాపోటీగా ఆడేస్తుండడమే అసలు విశేషం. గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన రణబీర్ కపూర్-ఐశ్వర్యా రాయ్-అనుష్క శర్మలు నటించిన మూవీ యే దిల్ హై ముష్కిల్.. అజయ్ దేవగన్ దర్శకత్వం వహించి హీరోగా నటించిన శివాయ్ లు.. ఐదు రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్ సాధించేశాయి.

శివాయ్ కు తొలి రోజున 10.24  కోట్లు.. శనివారం 10.06 కోట్లు.. ఆదివారం 8.26 కోట్లు.. సోమవారం 17.35 కోట్లు.. మంగళవారం 11.05 కోట్లు వసూళ్లు రాగా.. మొత్తం 56.96 కోట్లు కలెక్షన్స్ తో స్టడీగా నిలిచింది శివాయ్. ఇక యే దిల్ హై ముష్కిల్ కు తొలి రోజున 13.30 కోట్లు.. శనివారం 13.10 కోట్లు.. ఆదివారం 9.20 కోట్లు.. సోమవారం 17.75 కోట్లు.. మంగళవారం 13.03 కోట్లు రాబట్టి కాసింత డామినేషన్ చూపించింది. మొత్తంగా ఈ మూవీకి 66.38 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఒకేసారి రిలీజ్ అయిన రెండు చిత్రాలకు.. ముందు నుంచి పోటీ ఉండగా.. రెండూ రికార్డ్ వసూళ్లు సాధించడం మాత్రం.. రికార్డ్ అనే చెప్పాలి.

ఇప్పటికైతే శివాయ్.. యే దిల్ హై ముష్కిల్ లు ఈక్వల్ గా సత్తా చాటుతుండడంతో.. మరోవారం ఆగితే కానీ అసలైన విన్నర్ ఎవరో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News