రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ స్వగ్రామమైన పశ్చిమగోదావరి జి్ల్లా మొగల్తూరులో భారీగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు. అందుకోసం ఏకంగా లక్షమందికి సరిపడ్డ వెజ్-నాన్ వెజ్ వంటకాలు వండిస్తున్నారు. ఆ ఏర్పాట్లను ఏడెకరాల మామిడి తోటలో చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా కొద్ది సేపటి క్రితమే డార్లింగ్ ప్రభాస్ కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో అభిమానులు ప్రవాహం వెల్లువలా మారింది. ప్రభాస్ ఇంటి వద్దకు చేరుకుని 'రెబల్ స్టార్'.. 'రెబల్ స్టార్' అంటూ నినాదాలు చేస్తున్నారు. అంతకు మందు ప్రభాస్ రాకను ఆహ్వానిస్తూ మొగల్తూరులో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.
ప్రభాస్ మొగల్తూరుకు 12 ఏళ్ల తర్వాత వచ్చారు. 2010 లో తన తండ్రి సూర్య నారాయణరాజు మరణించిన సమయంలో సంతాప కార్యక్రమం కోసం మొగల్తూరులో వారం రోజుల పాటు ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ మొగల్తూరు వెళ్లింది లేదు. మళ్లీ ఇంత కాలానికి 2022...సెప్టెంబర్ 29న వెళ్లడం విశేషం.
ప్రస్తుతం ప్రభాస్ సలార్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సంస్మరణ సభ కోసమే రెండు రోజుల పాటు సమయం కేటాయించుకుని మొగల్తూరు కి వచ్చారు. ఈ రోజు కార్యక్రమం ముగియగానే డార్లింగ్ తిరిగి వెంటనే హైదరాబాద్ ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే.
దేశ విదేశాల్లోనూ డార్లింగ్ కి భారీ అభిమానులున్నారు. అంతటి స్టార్ మొగల్తూరులో ప్రత్యక్షమైతే సన్నివేశాం ఎలా ఉంటుందో? చెప్పాల్సిన పనిలేదు. మొగల్తూరు సహా చుట్టు పక్క పల్లె..పట్టణాలు అన్ని డార్లింగ్ కోసం కదిలాయి. ఆయన్ని చూడటం కోసం అభిమానులు ఎగబడుతున్నారు. భారీ ఎత్తున బందోబస్త్ ఏర్పాటు చేసినా అదుపు చేయడం కష్టతరంగానే మారుతోందని త తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.