'బొంబాయి' త‌ర్వాత ఆ రికార్డు బాల‌య్య సొంతం!

Update: 2022-06-16 04:41 GMT
మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన 'ప్రేమ‌కావ్యం' బొంబాయి రిలీజ్ స‌మ‌యంలో చోటుచేసుకున్న సంచ‌ల‌నాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. హిందు అబ్బాయి-ముస్లీం అమ్మాయి ల‌వ్ స్టోరీ రిలీజ్ నేప‌థ్యంలో హైద‌రాబాద్..బెంగుళూరు..చెన్నై  సిటీ స‌హ ముస్లీం ప్రాభావిత ప్రాంతాల్లో పెద్ద ఘర్ష‌ణ‌కి దారి తీసే వాతావ‌ర‌ణ‌మే క‌నిపించింది.

అప్ప‌ట్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని ముస్లీం సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసాయి. రెండు వేర్వేరు మ‌తాల్లో ప్రేమ ఏంటి? అని  పాత బ‌స్తీలాంటి ఏరియాలో ఘ‌ర్ణ‌ణ వాతావ‌ర‌ణం క‌నిపించింది. దీంతో బొంబాయి సినిమా సిటీలో రిలీజ్ అవుతుందా? అన్న సందిగ్ధం సైతం ఒకానొక స‌మ‌యంలో వ్య‌క్తం మైంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా అత్యంత సెన్సిటివ్ ఏరియాగా అప్ప‌టికే  పాత బ‌స్తీకి పేరుంది.

రిలీజ్ అనంత‌రం ముస్లీం మ‌నోభావాలు ఏమాత్రం దెబ్బ‌దిన్నా...రాష్ర్టం అగ్ని గుండంగా మారుతుంద‌ని సందేహాలు వ్య‌క్తం అయ్యాయి. అయినా మ‌ణిర‌త్నం త‌గ్గేదేలే అంటూ అప్ప‌ట్లో బొంబాయిని  ఎన్నో స‌వాళ్ల మ‌ధ్య రిలీజ్ చేసారు.  పాత బ‌స్తీలో భారీ పోలీసులు బందోబ‌స్తు  ఏర్పాటు చేసి...144  సెక్ష‌న్ అమలులోకి తీసుకొచ్చి మ‌రీ 'బొంబాయిని' రిలీజ్ చేసారు.

ఆ ర‌కంగా 'బొంబాయి' రిలీజ్ ఎప్ప‌టికీ ఓ సంచ‌ల‌న‌మే. అయితే రిలీజ్ కి ముందు ముస్లీం సంఘాల‌కు స్పెష‌ల్ ప్రీవ్యూ వేసి వాళ్ల పూర్తి స‌హకారం..అనుమ‌తితోనే  రిలీజ్ చేయ‌డం జ‌రిగింది. ఆ ర‌కంగా అప్ప‌ట్లో  అల్ల‌ర్లు చెల‌రేగ‌లేద‌ని తెలుస్తుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితి  తొమ్మిదేళ్ల గ్యాప్ అనంత‌రం పున‌రావృతం అయింది.

న‌ట‌సింహం బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'ల‌క్ష్మీ న‌ర‌సింహ' ఆ పరిస్థితి తీసుకొచ్చింద‌ని  తెలుస్తుంది. త‌మిళ సినిమా 'సామి'కి రీమేక్ గా జయంత్ సీ. ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన  'ల‌క్ష్మీన‌ర‌సింహ' 2004 లో రిలీజ్ అయింది. అప్ప‌ట్లో అభిమాన సంఘాలు ఎంతో  యాక్టివ్ యాక్టివ్ గా ఉండేవి.  స్టార్ హీర‌లో సినిమాల్ని ముందు న‌డింపిచేవి  అభిమాన సంఘాలే.

ఒకే హీరో పేరిట నాలుగైదు సంఘాలుండేవి. దీంతో అభిమానుల మధ్య రిలీజ్ స‌మ‌యంలో గొడ‌వ‌లు జ‌రిగేవి. ఈ నేప‌థ్యంలో 'ల‌క్ష్మిన‌ర‌సంహ' రిలీజ్ స‌మ‌యంలో కొన్ని ప్రాంతాల్లో అప్ప‌టి  ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ‌..స‌హా కొన్ని ప్రాంతాల్లో 144 సెక్ష‌న్ అమ‌లులోకి తెచ్చింది.  ఆ రకంగా బాల‌య్య పేరిట 'బొంబాయి' త‌ర్వాత 'ల‌క్ష్మి న‌రసింహ‌' ఓ రికార్డుగా నిలిచింది. ఓ తెలుగు హీరో సినిమాకి 144   సెక్ష‌న్ విధించ‌డం అదే తొలిసారి అయితే..అది ఓ త‌మిళ సినిమా రీమేక్ కావ‌డం గ‌మ‌నించాల్సిన విష‌జ్ఞం. మొత్తం   450 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన  'ల‌క్ష్మి న‌ర‌సింహ‌' బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. 
Tags:    

Similar News