ఏమైనా సరే దొరకొచ్చు. కానీ.. సినిమా థియేటర్లలో టికెట్లు మాత్రం అన్నిసార్లు దొరికే ఛాన్సు అసలే ఉండదు. ఎంతటి తోపులైనా సరే.. సినిమా టికెట్ల విషయానికి వస్తే మాత్రం రాజీ తప్పదు. అనుకున్న షోకు అనుకున్న రీతిలో టికెట్లు దొరకటం ఎక్కడో వేళ్ల మీద లెక్క పెట్టేవారిని మినహాయిస్తే.. మిగిలిన వారందరికి సాధ్యం కాని విషయమే. కొత్త సినిమా.. అందునా వీకెండ్స్ లో పెద్ద పెద్ద నగరాల్లోనూ.. పట్టణాల్లో టికెట్లు దొరకటం చాలా కష్టం. ముందుచూపుతో చాలా ముందుగా టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఫర్లేదేమో కానీ.. థియేటర్ కు వెళ్లి ట్రై చేయటం.. టికెట్లను సొంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు.
ఇలాంటివెన్నో అనుభవాలు కరోనాకు ముందే. ఇప్పుడు కాదు. మహమ్మారి మానవాళి మీద విరుచుకుపడటానికి ముందు ఉన్న పరిస్థితుల్లో ఏ ఒక్కటి ఇప్పుడు లేదన్న నిజం. ముఖం మీద పెట్టే మూతిగుడ్డ మొదలు ప్రతి అంశం జీవితంలో చాలానే మార్పుల్ని తీసుకొచ్చింది. అలాంటిది సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ మాటకు వస్తే.. కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో వినోద రంగం.. అందునా సినిమా రంగానికి తగిలిన దెబ్బ అంతా ఇంతా కాదు.
ఇప్పటికి ఏపీలో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. దీంతో.. పెద్ద సినిమాలు.. క్రేజీ సినిమాల్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ధైర్యం చేయటం లేదు. ఏపీలాంటి పెద్ద మార్కెట్ ను వదిలేసి సినిమాను విడుదల చేయటం అర్థం లేని పని. అందుకే.. తెలంగాణ రాష్ట్రంలో థియేటర్లు తెరుచుకోవచ్చని అధికారికంగా ఆదేశాలు జారీ చేసినతర్వాత కూడా పెద్ద సినిమాలు ఇప్పటికి విడుదల కావటం లేదంటే కారణం.. ఏపీ ప్రభుత్వం విధించిన పరిమితులే. ఇప్పటికి రాత్రి 10 నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ ఉండటంతో రాత్రి రెండో ఆట (సెకండ్ షో) ఇప్పటికి ఏపీలో వేయలేని పరిస్థితి. రోజుకు మూడు ఆటలు మాత్రమే వేస్తూ.. టికెట్ల రేట్లు అతి తక్కువగా నిర్దేశించిన వేళ.. సినిమాలు ఎందుకు విడుదల అవుతాయి.
ఈ కారణంతోనే ప్రతి శుక్రవారం విడుదలవుతున్న సినిమాలు అరడజనుకు తగ్గకున్నా.. మొదటి వేవ్ తర్వాత సినిమా థియేటర్లు తెరిచినప్పటి పరిస్థితి ఇప్పుడైతే లేదన్నది నిజం. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లనే ఇలాంటి పరిస్థితి. ఇలాంటి వేళ..శనివారం విడుదలైన పాగల్ మూవీ పుణ్యమా అని.. చాలా రోజుల తర్వాత పలు థియేటర్లలో SOLD OUT అన్న మాట వినిపించింది. కరోనా తర్వాత థియేటర్లకు జనాలు వస్తున్నది అంతంత మాత్రమే. కొన్న మల్టీ ఫ్లెక్సుల్లో ఉండే సీట్లు తక్కువ. అవి కూడా నిండని పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో పాగల్ మూవీతో చిత్రమైన అనుభవం చాలామందికి ఎదరైంది. ఆన్ లైన్ లో శనివారం సాయంత్రం టికెట్లను చెక్ చేస్తే.. చాలా రోజుల తర్వాత SOLD OUT మాట వినిపించింది. థియేటర్లకు వెళ్లిన వారిలో కొందరికి నిరాశను కలిగించిన వైనం తెలిసిన సినీ ప్రముఖుల్లో కొత్త ఉత్సాహం పొంగుతుందన్న మాట వినిపిస్తోంది. కరోనా లాంటి మహమ్మారి విరుచుకుపడిన తర్వాత.. టికెట్లు అయిపోయాయన్న మాట రావటంతో పాగల్ కీలకభూమిక పోషించటమే కాదు.. చాలామందికి పాత అనుభవాన్ని సరికొత్తగా ఇచ్చిందని చెప్పాలి.