మొన్న నానా పటేకర్.. నిన్న వైరముత్తు.. రేపేవరు? #మీటూ కాంపెయిన్లో భాగంగా రోజుకో సెలబ్రిటీ పేరు బయటకు వస్తోంది.రీసెంట్ గా శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగ పైనా కూడా ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. చిన్మయి శ్రీపాద తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక మహిళ రాసిన లెటర్ ను పోస్ట్ చేసింది. తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక మహిళ ఆ లెటర్ లో లసిత్ మలింగ తనను లైంగికంగా వేధించాడని తెలిపింది. ఐపీఎల్ సీజన్ లో భాగంగా ముంబైలో తన ఫ్రెండ్ ను కలిసేందుకు హోటల్ కు వెళ్ళిందట. అక్కడ పొరపాటున మలింగ రూమ్ కు వెళ్ళడంతో బెడ్ మీదకు లాగి ముద్దులు పెట్టాడట. హోటల్ స్టాఫ్ రావడంతో మలింగా బారినుండి తప్పించుకున్నానని తెలిపింది.
మరో పేరు వెల్లడించని బాలీవుడ్ నటి 'గులాబ్ గ్యాంగ్' డైరెక్టర్ సౌమిక్ సేన్ తనను లైంగికంగా తనను వేధించాడని చెప్పింది. ఫేస్ బుక్ ద్వారా అయన తనతో పరిచయం చేసుకున్నాడని.. తన నెక్స్ట్ సినిమాలో ఒక లెస్బియన్ పాత్ర ఉందని.. దాని గురించి మాట్లాడదామని అన్నాడట. తనను శాంటా క్రజ్ లోని తన అపార్ట్ మెంట్ వద్ద కలవని చెప్పాడట. అక్కడికి వెళ్తే పోర్న్ చూడమని చెప్పాడట.. తనను ముద్దుపెట్టమని బలవంతం చేశాడట. తను రాసిన శృంగార కథలను చదవమన్నాడట.
మరో నటి 'ప్యార్ కా పంచనామా' డైరెక్టర్ లవ్ రంజన్ పైన ఇలాంటి ఆరోపణలే చేసింది. తన లైఫ్ స్టైల్ గురించి అసందర్భపు ప్రశ్నలడిగాడని.. ఆడిషన్ సందర్భంగా బట్టలిప్పమన్నాడని చెప్పింది. ఇక బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ తనకు డ్రగ్స్ ఇచ్చిమరీ అత్యాచారం చేశాడని మరో మహిళ ఆరోపించింది. సీనియర్ బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ పై మరో మహిళ ఇలాంటి ఆరోపణలే చేసింది. తనను అలోక్ నాథ్ అత్యాచారం చేశాడని చెప్పింది.
ఈ లిస్టు ఇంతటితో ఆగేలా లేదు. బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్.. డైరెక్టర్లు వికాస్ బల్.. సాజిద్ ఖాన్.. అభిషేక్ కపూర్ ల పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ ముగ్గురు డైరెక్టర్లు పని చేస్తున్న ప్రాజెక్టుల నుండి బయటకు రావాల్సిన పరిస్థితి ఎర్పడింది. హృతిక్ రోషన్ ప్రస్తుతం వికాస్ దర్శకత్వంలో 'సూపర్ 30' అనే సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్ పై ఆరోపణలు వచ్చిన తరవాత హృతిక్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించాలని చూస్తున్నాడట.
సాజిద్ ఖాన్ ప్రస్తుతం అక్షయ్ కుమార్ 'హౌస్ ఫుల్ 4' కు దర్శకుడు. ఆరోపణలపై నిజా నిజాలు తేలేంతవరకూ సినిమా షూట్ ను అక్షయ్ ఆపమని చెప్పాడు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చెసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆగింది. అభిషేక్ కపూర్ నెక్స్ట్ సినిమా 'మొగల్'.. గుల్షన్ కుమార్ బయోపిక్ అయిన ఈ సినిమాలో హీరో ఆమిర్ ఖాన్. అభిషేక్ పై ఆరోపణలు వచ్చిన తర్వాతా అమీర్ ఈ సినిమానుండి తప్పుకున్నాడు.
ఇంకా ఈ #మీటూ లో ఎన్ని పేర్లు బయటకు వస్తాయో ఏమో. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే ఈ హంగామా ఇప్పట్లో ఆగేలా లేదు.