సోలోగా పైకొచ్చిన హీరోలు.. ఫ్యాన్స్ మధ్య గోడవేంటి?
వాస్తవానికి సదరు హీరోల మధ్య ఎప్పుడూ మంచి రిలేషన్ ఉంది. ఒకరి సినిమా ఈవెంట్లలో మరో హీరో పాల్గొనడం కూడా జరిగింది.;
సోషల్ మీడియా ప్రపంచంలో ఫ్యాన్ వార్స్ కొత్త కాదు. ఒకరి హీరోని పొగడడం కంటే, ఎదురు హీరోను దూషించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్న ట్రెండ్ మాత్రం మరింత తీవ్రమవుతోంది. ఇటీవలె మరోసారి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్ల అభిమానులు సోషల్ మీడియాలో నువ్వా నేనా అనే రేంజ్ లో ఫ్యాన్ వార్స్ కొనసాగిస్తున్నారు. వాస్తవానికి సదరు హీరోల మధ్య ఎప్పుడూ మంచి రిలేషన్ ఉంది. ఒకరి సినిమా ఈవెంట్లలో మరో హీరో పాల్గొనడం కూడా జరిగింది.
ఇద్దరు కూడా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారే. ఇక ఒకప్పుడు ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటించారు కూడా. కానీ ఇప్పుడు వారి ఫ్యాన్స్ మధ్య తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేలుతున్నాయి. దీనికి కారణం, ఒకరిపై మరొకరు చేస్తున్న ఆరోపణలే. ఒకరు ఎప్పుడూ ‘సొంతంగా ఎదిగినవాడిని’ అనే గంభీరమైన ఇమేజ్‌ను తీసుకెళ్తుంటే, మరొకరు ‘మీలో ఒకడిని’ అనే మాస్ ఇమేజ్‌తో కొనసాగుతున్నారు.
కానీ ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరిని ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా చూసుకుంటూ సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దిగుతున్నారు. ప్రస్తుత వివాదానికి కారణం ఏమిటంటే.. ఒక హీరో సినిమాలు వరుస డిజాస్టర్లకు గురయ్యాయి. దీంతో అతని ఫ్యాన్స్ ఈ ఫలితాలకు అసలు కారణం ఎదురు హీరో పీఆర్ టీమ్‌లే అంటూ ఆరోపణలు మొదలుపెట్టారు. ‘మన హీరో రాబోయే సినిమాపై కూడా నెగటివిటీ పుట్టించేందుకు మరో హీరో టీమ్ ప్రయత్నిస్తోంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
ఇద్దరి హీరోల సినిమాలు కూడా రాబోయే రోజుల్లో ఒకే నెలలో రానున్నాయి. అదే సమయంలో, మరొకరి ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. ‘సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటే కారణాలు వెతకాలి కానీ, ఎదురు హీరో మీద తప్పుడు ఆరోపణలు చేయడం ఏమిటి?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకరికి మరొకరు పోటీగా బ్యాడ్ ట్రెండ్‌లు పెడుతూ, కౌంటర్ మీమ్స్ వదులుతూ, ఒకరి క్రేజ్‌ను మరో హీరో టీమ్ నాశనం చేస్తోందనే ఆరోపణలు చేయడం మరీ తీవ్రమవుతోంది.
ఫ్యాన్స్ చేసే ట్వీట్లలో వ్యక్తిగత దూషణలు, అసంబద్ధ ఆరోపణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ ఇద్దరు హీరోలు మంచి స్నేహితులే. కెరీర్ ఆరంభంలో ఒకరు మరొకరికి అవకాశాలు కల్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ బంధాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇద్దరూ ఒకే పరిశ్రమలో ఎదుగుతున్నారు. ఒకరి సినిమా హిట్ అయితే మరొకరు సపోర్ట్ చేస్తారు. కానీ అభిమానులు మాత్రం వారి కెరీర్‌ను పోటీగా చూస్తూ, ఫలితాలను ఆధారంగా చేసుకుని ‘యువర్ హీరో vs మై హీరో’ అనే లెవెల్‌కి వెళ్లిపోతున్నారు.
ఈ వివాదం ఎంతవరకు వెళ్లనుందో తెలియదు. కానీ ఫ్యాన్ వార్స్ గతంలో ఎన్నో సినిమాలకు, నటులకు ఇబ్బందులు తీసుకువచ్చాయి. టాలీవుడ్‌లో ఈ గొడవలు స్నేహితులుగా ఉన్న హీరోల మధ్య బలమైన గ్యాప్ తెచ్చాయి. అదే పరిస్థితి మళ్లీ జరుగుతుందా లేక ఈ వివాదానికి ఇద్దరు హీరోలు స్వయంగా స్పందించి ముగింపు పెడతారా? అనేది వేచి చూడాలి.