ఎన్టీఆర్ మళ్ళీ తగ్గాడు

ఇది స్టైలిష్ మేకింగ్, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కలిగిన భారీ పాన్ ఇండియా సినిమా కానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.;

Update: 2025-03-03 12:28 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్ బస్టర్లతో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రశాంత్, ఇప్పుడు ఎన్టీఆర్‌తో కలిసి మరింత మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కించబోతున్నారు. ఇది స్టైలిష్ మేకింగ్, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కలిగిన భారీ పాన్ ఇండియా సినిమా కానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయినప్పటి నుండి లుక్, కథ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్, బడ్జెట్ విషయాలను గమనిస్తే, ఇది మామూలు సినిమా కాదని అర్థమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లేటెస్ట్ టాక్ ప్రకారం, ఈ సినిమా కోసం 350-400 కోట్ల మధ్య బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. యాక్షన్ పార్ట్, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కథ నార్త్ ఈస్ట్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, డార్క్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గతంలో ఎన్నడూ చేయని విధంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. హీరో క్యారెక్టర్ డిజైన్ విషయానికి వస్తే, ప్రశాంత్ నీల్ తన మార్క్ మాస్ మేనరిజం పక్కాగా ఫాలో అవుతాడు. ఎన్టీఆర్ ఇప్పటివరకు తన కెరీర్‌లో ఇలా కనిపించలేదని, అతని లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను మరో లెవెల్‌కు తీసుకెళ్లేలా ఉంటుందని టాక్. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో ‘కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ మూవీ’ అనే రేంజ్‌లో ఉండబోతుందని అంటున్నారు.

ఈ సినిమాలో పాత్ర కోసం ఎన్టీఆర్ ఏకంగా 14 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. గతంలో ‘యమదొంగ’ కోసం రాజమౌళి చెప్పినట్టుగానే ఎన్టీఆర్ తన బరువును భారీగా తగ్గించి కొత్త లుక్‌లో కనిపించారు. ఇప్పుడు అదే విధంగా, ప్రశాంత్ నీల్ కోసం మళ్లీ ఎన్టీఆర్ బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ విజువలైజ్ చేసిన పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ఎన్టీఆర్ తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై బాగా కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ ట్రైనింగ్, స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ 14 కేజీలు తగ్గి, మేకోవర్ అయ్యాడట.

ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన షేడ్స్‌లో కనిపించబోతున్నారని టాక్. ఒకటే పాత్రలో డ్యూయల్ షేడ్స్‌తో ఆకట్టుకునేలా ప్రశాంత్ స్క్రిప్ట్‌ను డిజైన్ చేశాడని తెలుస్తోంది. ఒక షేడ్‌లో ఎన్టీఆర్ చాలా సింపుల్‌గా కనిపించగా, మరో షేడ్‌లో మాత్రం పూర్తి రఫ్ & ఇంటెన్స్ లుక్‌లో ఉండనున్నారని సమాచారం.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని సమాచారం. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని, రెండో షెడ్యూల్‌కు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయని టాక్. మేకర్స్ ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జనవరి 2026లో ఈ పాన్ ఇండియా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ పూర్తయిన తర్వాత భారీ ప్రమోషన్స్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News