ఈ వారం బాక్సాఫీస్ క్లాష్ - హిట్ కొట్టేది ఎవరు?

పది వరకు సినిమాలు పోటీకి దిగుతుండగా, వాటిలో ఏదైనా హిట్ అవుతుందా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది.;

Update: 2025-03-03 11:56 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ గత వారం పెద్దగా హుషారు చూపించలేదు. మజాకా సినిమా యావరేజ్ టాక్‌తోనే సరిపోగా, శబ్దం, అగత్యా వంటి డబ్బింగ్ చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఇప్పుడు కొత్త వారం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. పది వరకు సినిమాలు పోటీకి దిగుతుండగా, వాటిలో ఏదైనా హిట్ అవుతుందా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది.

చావా - ఆలస్యమైన రాక, కానీ బజ్ ఎక్కువే

హిందీలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చావా సినిమా తెలుగులోకి ఆలస్యంగా వస్తోంది. ఇది ఇప్పటికి 500 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డ్స్‌ను తిరగరాసింది. కానీ ఆలస్యం అయిన డబ్బింగ్ సినిమాలకు ఎప్పుడూ రిస్క్ ఎక్కువే. ఇది మొదటివారంలో కనీసం ఓ మోత్తుగా వసూళ్లు సాధిస్తే, తర్వాత లాంగ్ రన్‌లో నిలబడే అవకాశం ఉంటుంది. ఈ సినిమాకు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కావడం కలిసి వచ్చే అంశం.

మలయాళం నుంచి 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'

మలయాళ బ్లాక్‌బస్టర్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ తెలుగులోకి అనువదించబడుతోంది. ఇందులో కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా పోలీస్ బ్యాక్‌డ్రాప్‌తో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిగి ఉంది. మలయాళ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు మంచి క్రేజ్ ఉండటంతో, ఇది కొంతవరకు థియేటర్లలో నిలబడే అవకాశముంది.

కోలీవుడ్ నుంచి 'కింగ్స్టన్' - హారర్ థ్రిల్లర్

జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన కింగ్స్టన్ సినిమాకు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సముద్రం నేపథ్యంలో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికే ప్రమోషన్లు బాగా చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా పేరున్న జీవీ ప్రకాష్ నటన ఎలా ఉంటుందనేది చూడాలి. ఇదే సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తో ఈ సినిమా ప్రమోషన్‌ను భారీగా ప్లాన్ చేశారు.

తెలుగు లోకల్ సినిమాలు - నారి, రారాజు, పౌరుషం

ఈ వారం టాలీవుడ్ నుంచి నారి, రారాజు, పౌరుషం, వైఫ్ అఫ్ అనిర్వేష్, శివంగి, నీరుకుళ్ళ, 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో కొన్ని కొత్త కాన్సెప్ట్‌లతో వస్తుండగా, మరికొన్ని పూర్తిగా కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కాయి. అయితే వీటికి ప్రమోషన్లు తక్కువగా ఉండటంతో, ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

రీరిలీజ్ హవా - ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ డామినేషన్

ఈ వారంలో విడుదల కానున్న అన్ని కొత్త సినిమాల కంటే ఎక్కువగా డిమాండ్ ఉన్న సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ-రిలీజ్. మహేష్ బాబు, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో ఉన్నాయి. కొత్త సినిమాల కంటే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న విశ్లేషణ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

ఎవరు హిట్ కొడతారో..

ఈ వారం హిట్ కొట్టేది ఎవరు అనేది పూర్తిగా మొదటి రోజు పబ్లిక్ టాక్ మీద ఆధారపడి ఉంటుంది. చావా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ పెద్ద స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ ఉండటం కలిసి వచ్చే అంశం. కానీ డబ్బింగ్ సినిమాలకు మౌత్ టాక్ అనేది కీలకం. ఇక తెలుగు సినిమాలు చిన్న స్థాయిలో ఉండటంతో వాటికి తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ రావాల్సిందే. మొత్తానికి ఈ వారం సినిమాల రన్ ఎలా సాగుతుందో చూడాలి.

Tags:    

Similar News