తమిళంలో రజనీకాంత్ తర్వాత అంత పాపులారిటీ ఫ్యాన్ ఇమేజ్ ఉన్న నటుడు ఇళయదళపతి విజయ్. అతడి సినిమాలు యావరేజ్ గా ఉన్నా తమిళంలో కలెక్షన్ల వర్షం కురుస్తుంది. మరో తమిళనటుడు సూర్య - అతడి తమ్ముడు కార్తికి తమిళంతోపాటు తెలుగులోనూ సమానమైన క్రేజ్ ఉంది. తమిళనాడుకు పోటీగా ఇక్కడ వీరిద్దరి సినిమాలు కలెక్షన్లు రాబడతాయి. వీళ్లలాగే తాను కూడా తెలుగులోనూ ఇమేజ్ పెంచుకోవాలని విజయ్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇంతవరకు కాలం కలిసిరాలేదు.
విజయ్ హీరోగా స్టార్ డైరెక్టర్లు మురుగదాస్ - శంకర్ దర్శకత్వంలో వచ్చిన తుపాకి - స్నేహితుడు మాత్రం తెలుగులో సోసోగా ఆడాయి. మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డవే. అయినా విజయ్ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా తమిళంలో అతడు నటించి యావరేజ్ గా ఆడిన భైరవ సినిమాను తెలుగులో డబ్ చేసి ఏజెంట్ భైరవ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అంతా అరవ అతి కనిపిస్తూనే ఉంది. తమిళం వస్తున్న రొటీన్ సినిమాలు తెలుగులో ఆడే రోజులు ఎప్పుడో వెళ్లిపోయాయి. కానీ విజయ్ మార్కెట్ పెంచుకోవాలి అనుకుంటున్నాడే తప్ప స్ట్రాటజీ మార్చడం లేదు.
భైరవ ట్రైలర్ చూసేసరికే ఇందులో మనకు నచ్చే విషయమేం లేదని తేలిపోతూ ఉంది. ఈ సినిమాలో తెలుగు వాళ్లకు నచ్చే ఎట్రాక్షన్ ఏమన్నా ఉందంటే అది హీరోయిన్ కీర్తి సురేష్ మాత్రమే. తెలుగులో వరస హిట్లతో దూసుకుపోతున్న కీర్తి గ్లామర్ తప్ప ఇంకో కంటెంటేం కనిపించడం లేదు. అయినా అక్కడ సూపర్ హిట్టయిన సినిమాలను తీసుకొస్తే కాస్తోకూస్తో ఆడే అవకాశం ఉంటుంది. తమిళ ప్రజలకే నచ్చని సినిమాను తెలుగు ప్రేక్షకులపై రుద్దాలనుకోవడం ఏమిటో.. ఏం చేస్తాం?
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/