'ఏజెంట్' టీజర్: స్టైలిష్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో అదరగొట్టిన అఖిల్..!
అక్కినేని వారసుడు, యూత్ కింగ్ అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ''ఏజెంట్''. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించగా.. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన 'ఏజెంట్' ఫస్ట్ లుక్ విశేష స్పందన తెచ్చుకుని సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ నేపథ్యంలో సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ మరియు శాండిల్ వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ కలిసి తమిళం మరియు కన్నడ భాషలలో ఈ టీజర్ ను లాంచ్ చేశారు.
అఖిల్ 'ఏజెంట్' తెలుగు ట్రైలర్ ను ఆవిష్కరించగా.. మలయాళంలో మమ్ముట్టి రిలీజ్ చేశారు. హైదరాబాద్ లోని మల్లికార్జున థియేటర్ లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో నాలుగు దక్షిణాది భాషలతో పాటుగా హిందీ వెర్షన్ టీజర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు.
మమ్ముట్టి పోషించిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అధిపతి మహదేవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టీజర్ కట్ ప్రదర్శించబడింది. విచారణ కోసం పిలిచినప్పుడు, అతను 'ఏజెంట్' యొక్క ధైర్యం, పరాక్రమం మరియు అనూహ్య స్వభావం గురించి వెల్లడించాడు.
ఏజెంట్ అత్యంత అపఖ్యాతి పాలైన, క్రూరమైన దేశభక్తుడని.. అతన్ని పట్టుకోవడం అసాధ్యమని.. తన డెత్ నోట్ ఇప్పటికే రాసి ఉందని చెప్తాడు. అలానే అఖిల్ లవ్ ఇంట్రెస్ట్ సాక్షి వైద్య అతన్ని ‘వైల్డ్ సాలే’ అని పిలుస్తుంది.
అఖిల్ తన యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్ లో సరికొత్తగా కనిపించాడు. చేతిలో గన్ పట్టుకొని స్టైల్ గా నడుచుకుంటూ ఫైరింగ్ చేయడాన్ని బట్టిచూస్తే.. అతను నిజంగా చావుకు భయపడని వ్యక్తి అని చెప్పొచ్చు. ఇందులో అఖిల్ మేకోవర్ అద్భుతంగా ఉంది. అతని బ్యాక్ సైడ్ టాటూ.. స్టైలింగ్ ప్రత్యేకంగా నిలిచాయి.
టీజర్ చివర్లో షూట్ చేయండి అంటూ అఖిల్ గట్టిగా అరుస్తూ ఫైరింగ్ చేసే సీక్వెన్స్ అతని శౌర్యాన్ని తెలియజేస్తుంది. మొత్తం మీద అఖిల్ తన అసాధారణ ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచాడని చెప్పాలి. సాక్షి వైద్య ఒక్క సీన్ లో ఉన్నా.. కూల్ గా అందంగా కనిపించింది. ఎప్పటిలాగే మమ్ముట్టి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.
మొదటి నుంచీ చెబుతున్నట్లుగానే సురేందర్ రెడ్డి 'ఏజెంట్' చిత్రాన్ని చాలా స్టైలిష్ గా రూపొందించినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ.. హిప్ హాప్ తమిజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దీనికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతిని పంచిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసిందని చెప్పాలి.
రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు సురేందర్2సినిమా పతాకాలపై అనిల్ సుంకర 'ఏజెంట్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర మరియు పతి దీపా రెడ్డి ఈ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించగా.. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
'ఏజెంట్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలోనే విడుదల కాబోతోంది.
Full View