మూడవ స్థానం కొట్టేసిన అజ్ఞాతవాసి

Update: 2018-02-13 17:45 GMT
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక అభిమానుల సంపాదించుకున్న వారిలో పవన్ కళ్యాణ్ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆయన కెరీర్లో విజయలకంటే అపజయలే ఎక్కువగా ఉన్నాయి. అయితే పవన కళ్యాణ్ గత సినిమాలు రిజల్ట్ ని పక్కన పెడితే ఈ ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన అజ్ఞాతవాసి మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కడంతో మొదట ఏ స్థాయిలో అంచనాలు పెరిగాయో అందరికి తెలిసిందే.

అయితే మర్నింగ్ షోకే సినిమా సంగతి తెలియడం తో మ్యాట్నీ షో నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఇక గత నెల 10న రిలీజ్ అయిన అజ్ఞాతవాసి క్లోసింగ్ కలెక్షన్స్ ని ఒకసారి చూస్తే.. సినిమా మొత్తంగా వరల్డ్ వైడ్ రూ 94.6 కోట్లను వసూలు చేయగా రూ 57.5కోట్ల షేర్లు అందాయి. అయితే సినిమా త్రియేటికల్ రైట్స్ మాత్రం మొత్తం రూ 125 కోట్లు. అంటే సినిమా కేవలం 46% రికవర్ చేసింది. ఇంత దారుణమైన నష్టాలను చూడడంతో దేశంలోనే థర్డ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అజ్ఞాతవాసి నిలిచింది. బాంబే వెల్వెట్ - స్పైడర్ అజ్ఞాతవాసి ముందు ప్లేస్ లో ఉన్నాయి.

ఏరియాల వారిగా వచ్చిన షేర్స్ ని ఒక సారి చూస్తే..

ఆంధ్రా - 25.15 కోట్లు
సీడెడ్ - 5.30 కోట్లు
నైజాం - 10.45 కోట్లు

ఆంధ్ర+తెలంగాణ    - 40.9 కోట్లు

యూఎస్ ఏ             - 7.20 కోట్లు
కర్ణాటక                  -6.35 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా   -1.15 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్        -1.19 కోట్లు

ప్రపంచం మొత్తంగా -రూ 57.5కోట్లు
Tags:    

Similar News