బిగ్ బాస్ 8 : మళ్లీ అతనే మెగా చీఫ్.. వాటే లక్కీ..!
ప్రేరణ భర్త శ్రీపాద కోసం గార్డెన్ ఏరియా మొత్తం చాలా అందంగా డెకరేట్ చేశారు.
బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ గా కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీస్ వచ్చి వారిని అలరించారు. వారు ఇచ్చిన సలహాలతో ఆటని మెరుగు పరచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యామిలీ వీక్ లో భాగంగా ప్రేరణ భర్త శ్రీపాదని.. తేజ వాళ్ల అమ్మ లక్ష్మిని సర్ ప్రైజ్ గా పంపించాడు బిగ్ బాస్. ప్రేరణ భర్త శ్రీపాద కోసం గార్డెన్ ఏరియా మొత్తం చాలా అందంగా డెకరేట్ చేశారు.
శ్రీపాద రాగానే ప్రేరణ పరుగెత్తుకుంటూ వెళ్లి అతన్ని కౌగిలించుకుంది. వారిద్దరు అలా సరదాగా ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత హౌస్ లోకి వెళ్లి హౌస్ మెట్స్ తో మాట్లాడారు. ప్రేరణకు ఇవ్వాల్సిన ఇన్ పుట్స్ ఇచ్చాడు శ్రీపాద. ప్రతి విషయానికి మిగతా వారి మీద అలా అరవకని చెప్పాడు. కావాలని నిన్ను ట్రిగర్ చేస్తారని నువ్వు సైలెంట్ అవ్వాలని అన్నాడు శ్రీపాద.
ఇక ఆ తర్వాత తేజ వాళ్ల అమ్మను తలచుకుని ఏడ్చాడు. ఈలోగా మెగా చీఫ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. చిక్కుముళ్లతో ఉన్న తాడులోంచి దాన్ని తీసుకుని పైన మూటలో చీఫ్ అనే అక్షరాలను ఎవరు ముందు ఆ పోడియం కి అతికిస్తారో వారే మెగా చీఫ్. అయితే ముందుగా అవినాష్ ఈ టాస్క్ లో గెలిచాడు. అలా అతను నెక్స్ట్ మెగా చీఫ్ అయ్యాడు. ప్రేరణ దగ్గర ఉన్న మెగా చీఫ్ బ్యాండ్ ని అతనికి ఇచ్చారు.
ఆ తర్వాత తేజాకి ఫోన్ ద్వారా అతని మదర్ మెసేజ్ పంపించింది. ఇక ఆమె రాదని అనుకున్న తేజాకి సర్ ప్రైజ్ ఇస్తూ ఆమె మెయిన్ గేట్ నుంచి వచ్చారు. దాంతో తేజా ఆనందానికి అవధుల్లేవని చెప్పాలి. తేజ మదర్ రావడం మిగతా హౌస్ మెట్స్ కి కూడా సంతోషాన్ని ఇచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ సక్సెస్ ఫుల్ గా పూర్తైంది.
ఐతే మెగా చీఫ్ గా అవినాష్ రెండోసారి గెలిచాడు. ఆల్రెడీ ఒకసారి మెగా చీఫ్ అయిన అవినాష్ తన ఆట తీరుతో మరోసారి గెలిచాడు. సో నెక్స్ట్ వీక్ అతని ద్వారా హౌస్ లో అతనికి కావాల్సిన వారు సేఫ్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. మరో నాలుగు వారాలు మాత్రమే ఉన్న బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 కి ఎవరు వెళ్తారు.. టైటిల్ విజేత ఎవరు అవుతారన్నది చూడాలి.