రాజకీయ పరిణామాల కారణంగా ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడం ఆయన స్థానంలో నూతన ముఖ్యమంత్రిగా ఏక్ నాధ్ షిండే ప్రమాన స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియా వేదికగా ఉధ్దవ్ సేవల్ని స్మరించుకుంటూ బాలీవుడ్ సెలబ్రిటీలు..నెటి జనులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అలాగే నూతనంగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి దియా మిర్జా కూడా అలాగే ఉద్ధవ్ ఠాక్రే పని తననాన్ని ప్రశంసిస్తూ ఓ పోస్ట్ చేసింది. ప్లానెట్ తో పాటు ప్రజల్ని ఎంతో బాగా చూసుకున్నారు. అందుకే ఇక్కడ కృతజ్ఞతలు చెబుతున్నాను. దేశానికి సేవ చేసినందుకు మరిన్ని అవకాశాలు వస్తాయి. థాంక్యూ ఉద్దవ్ ఠాక్రే అని దియా రాసుకొచ్చారు.
అయితే ఈ పోస్ట్ పై బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వ్యంగ్యాస్ర్తం సంధించారు. ``ఏ ప్లానెట్..? ప్టానెట్ బాలీవుడా..?` అని వివేక్ కామెంట్ పెట్టాడు. ఉద్దవ్ సేవల్ని కొనియాడినందుకు వివేక్ ఇలాంటి రియాక్షన్ ఇచ్చాడంటూ నెటి జనులు కామెంట్ల రూపంలో అభిప్రాయపడుతున్నారు. ఠాక్రే ప్రభుత్వానికి వివేక్ వ్యతిరేకి అనుకుంటా? అందుకే ఇలా తనలో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడంటూ ఓ నెటి జనుడు కామెంట్ చేసాడు.
అయితే దీనిపై దియా మీర్జా ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మరి ఒకవేళ రిప్లై ఇస్తే గనుక వివేక్ కామెంట్ కి ధీటుగా బధులిస్తుందా? సమర్ధత అనే కోణంలో స్పందిస్తుందా? అన్నది చూడాలి. ఇటీవలి కాలంలో వివేక్ అగ్నిహోత్రి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా కామెంట్లు గుప్పిస్తూ విమర్శలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే.
మరి తాజా కామెంట్ రాజకీయ దుమారానికి దారి తీస్తుందా? అన్నది చూడాలి. ఇటీవలే ఆయన కశ్మీర్ పండిట్లపై `ది కశ్మీర్ పైల్స్` సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిదే. ఆ సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ వరకూ కొంత మంది నుంచి విమర్శలు ఎదుర్కున్నారు. రిలీజ్ తర్వాత పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది.
అలాగే కొత్త సీఎం కి కంగన రనౌత్ శుభాకాంక్షలు తెలిపింది. `ఆటో రిక్షా నడపడం నుంచి.. దేశంలోనే శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగారు. మీ ప్రయాణం ఎంతో స్ఫూర్తినిస్తుంది. మీకు శుభాకాంక్షలు` అని కంగన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.