పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వస్తోందంటే అభిమానుల హడావుడి మామూలుగా ఉండదు. పెద్దగా అంచనాలే లేకుండా విడుదలైన ‘కాటమరాయుడు’ టీజరే రికార్డుల మోత మోగించింది. ఇక పవన్-త్రివిక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా టీజర్ వస్తే ఇక మోత ఎలా ఉంటుందో చెప్పేదేముంది..? ఈ టీజర్ నిన్న సాయంత్రం ఆరున్నర గంటలకు సోషల్ మీడియాలోకి రావడం ఆలస్యం.. ప్రకంపనలు రేగాయి. కేవలం 30 నిమిషాల్లో మిలియన్ వ్యూస్ మార్కును దాటేయడం విశేషం. గంటలో వ్యూస్ 2 మిలియన్ మార్కుకు చేరువ అయిపోయాయి. కేవలం 80 నిమిషాల్లోనే ‘అజ్ఞాతవాసి’ టీజర్ లైక్స్ 2 లక్షలు దాటడం విశేషం. ఇవన్నీ తెలుగులో రికార్డులే. యూట్యూబ్ లో నిన్న సాయంత్రం నుంచి ఇది సౌత్ ఇండియాలో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. 20 గంటల్లోనే ఈ టీజర్ వ్యూస్ 5.2 మిలియన్లకు చేరుకున్నాయి. లైక్స్ 4 లక్షలకు చేరువవుతున్నాయి.
తెలుగు టీజర్లలో లైక్స్ పరంగా ఆల్ టైం రికార్డును కూడా ‘అజ్ఞాతవాసి’ టీజర్ దాటేసింది. ఈ టీజర్ రావడాని కంటే ముందే పవన్ ఫ్యాన్స్ పాత రికార్డుల్ని బద్దలు కొట్టి తీరాలని కంకణం కట్టుకుని ముందే సోషల్ మీడియా గ్రూపుల్ని అలర్ట్ చేశారు. దీంతో టీజర్ సోషల్ యూట్యూబ్ లోకి రావడం ఆలస్యం మోత మోగిపోయింది. 24 గంటల వ్యవధిలో ‘అజ్ఞాతవాసి’ టీజర్ వ్యూస్ 7 మిలియన్ మార్కును టచ్ చేస్తాయని భావిస్తున్నారు. విజయ్ మూవీ ‘మెర్శల్’ టీజర్ 24 గంటల వ్యవధిలో 11.2 మిలియన్ వ్యూస్ తో సౌత్ ఇండియాలో నెంబర్ వన్ గా ఉన్నట్లు చెబుతున్నారు. దాని తర్వాత 24 గంటల్లో 6.1 మిలియన్ వ్యూస్ తో ‘వివేగం’ టీజర్ రెండో స్థానంలో ఉంది. దాన్ని ‘అజ్ఞాతవాసి’ దాటేసి రెండో స్థానంలో నిలిచే అవకాశముంది.