తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు అయిన ఓటీటీ ఆహా. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో మొదలు అయిన ఆహా తక్కువ సమయంలోనే తెలుగు వారికి చాలా చేరువ అయ్యింది. తెలుగు వారి కోసం ప్రత్యేకంగా మొదలయ్యిన ఈ ఆహా ఇప్పుడు తమిళ్ లో కూడా వస్తున్న విషయం తెల్సిందే. తెలుగు మరియు తమిళంలో మంచి కంటెంట్ ఇస్తున్న ఆహా మరింతగా జనాల్లోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఆహా టీమ్ భారీ గా ఖర్చు పెట్టకుండా చిన్న సినిమాలను.. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను తీసుకోవడం... నిర్మించడం వంటివి చేస్తున్నారు. ఆహా కోసం ఇప్పటి వరకు భారీ బడ్జెట్ సినిమాలను ఎక్కువగా కొనుగోలు చేసిందే లేదు. అయినా కూడా మంచి ఖాతాదారులను సొంతం చేసుకుంది. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో ఆహా ప్రేక్షకులను అలరించడంలో ముందు ఉంది.
ఇప్పటి వరకు మలయాళం సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. ఆహా లో వచ్చిన పలు మలయాళం డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకర్షించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు మలయాళం మరియు తమిళ డబ్బింగ్ సినిమాలను తీసుకు వచ్చిన ఆహా ఇప్పుడు ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలతో ఆహా అనిపించేందుకు సిద్దం అయ్యారు.
ఈనెల 20వ తారీకున హాలీవుడ్ కు చెందిన ప్రముఖ స్టార్స్ యొక్క సూపర్ హిట్ సినిమాలు తెలుగు లో డబ్బింగ్ అయ్యి ఆహా లో స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. ఆహా లో హాలీవుడ్ డబ్బింగ్ సినిమాల కోసం ఖతాదారులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు హాలీవుడ్ సినిమాలు అది కూడా తెలుగు లో రాబోతున్న నేపథ్యంలో అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అరవింద్ మరియు టీమ్ సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రతి సినిమా కూడా పైసా వసూల్ అన్నట్లుగా ఉండేలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అందుకే ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి.
తక్కువ ఖర్చుతోనే ఆహా వారు మంచి వినోదాన్ని అందిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి టాక్ ఉంది. కనుక ముందు ముందు కూడా ఆ పేరును.. బ్రాండ్ ను నిలుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఆహా టీమ్ ప్రయత్నాలు చేస్తున్నారు.

Prediction: Your Friday is going to be BLOCKBUSTER