నేడు డిజిటల్ వరల్డ్ లో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ హవా స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. అందరూ ఈ ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ సినిమాలు వెబ్ సిరీస్ లు చూడటానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఇదివరకు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆలోచించేవారు ఆరాలు తీసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఏ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలవుతుందో అని ఆరాలు తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ఓటిటి ప్లాట్ ఫామ్స్ సబ్ స్క్రిప్షన్స్ తీసుకుంటూ.. షేర్ చేసుకుంటూ సినిమాలను వెబ్ సిరీస్ లను చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు మామూలు గిరాకీ లేదు. జనాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విరగబడి వెబ్ కంటెంట్ చూసేస్తున్నారు. ప్రస్తుతం మనకి డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ - అమెజాన్ ప్రైమ్ - హాట్ స్టార్ - సన్ నెక్స్ట్ - ఎమెక్స్ ప్లేయర్ - జీ 5..ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని ఓటీటీ యాప్స్ మన తెలుగులో కూడా సక్సెస్ అయ్యాయి.
కానీ వీటన్నిటికీ బ్రేక్ ఇస్తూ మొట్టమొదటి సారిగా మన తెలుగు నుంచే వచ్చిన 100 శాతం తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ నుంచి వచ్చిన ఈ యాప్ ప్రారంభంలో మంచి ఆదరణను రాబట్టుకుంది. కానీ రాను రాను మిగతా ఓటీటీలతో పోటీ పడలేకపోయిందనే కామెంట్స్ వచ్చాయి. అంతేకాకుండా 'ఆహా'లో వస్తున్న సినిమాలు వెబ్ సిరీస్ లు అంతలా ప్రభావాన్ని చూపలేకపోయాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీంతో మిగతా ఓటీటీలతో పోటీ పడలేకపోతోందని కామెంట్స్ వస్తున్నాయి. ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతావన్నీ ఓల్డ్ మూవీస్ అవడం.. వెబ్ సిరీసెస్ కంటెంట్ కూడా నెట్ ప్లిక్స్ ప్రైమ్ రేంజ్ లో లేకపోవడమే దీనికి కారణమని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'ఆహా' కి మళ్ళీ క్రేజ్ తీసుకురావడం కోసం ఒక ప్లాన్ వేసింది. 28 కార్టూన్ సినిమాలను ఇప్పుడు ఈ యాప్ నుంచి తమ వీక్షకులకు అందించబోతున్నట్లు వారు వెల్లడించారు.
ఇప్పటికే 'ఆహా' బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారట. ఇటీవలే “కనులు కనులను దోచాయంటే” డిజిటల్ ప్రీమియర్ తో ఆకట్టుకున్న 'ఆహా'లో ఇప్పుడు కార్టూన్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చాయి. ఛోటా భీమ్, మైటీ రాజు లాంటి కార్టూన్ సినిమాలు వీటిలో ఉన్నాయి. అయితే అన్ని ఓటీటీలలో ఒరిజినల్ సినిమాలతో వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్న తరుణంలో ఈ కార్టూన్ సినిమాలు ఎంత వరకు 'ఆహా'కు హెల్ప్ అవుతాయనేది చూడాలి. కాకపోతే ఇంటికే పరిమితమైన పిల్లలు వీటి పట్ల ఆకర్షితులయ్యే అవకాశాలు లేకపోలేదు. మరి వీటితోనైనా క్రేజ్ తెచ్చుకుని మరోసారి ఆహా అనిపించుకుంటుందేమో చూడాలి.