హీరోయిన్లని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లని కొట్టిన దర్శకులు, హీరోలు వున్నారు. అయితే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్టార్ డైరెక్టర్ ని కొట్టాలను కోవడం మాత్రం టాలీవుడ్ లో తొలిసారి. ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరెవరో కాదు ఒకప్పటి హీరోయిన్ , నటి లక్ష్మీ కూతురు ఐశ్వర్య. `అడవిలో అభిమన్యుడు` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఐశ్వర్య ఆ తరువాత తెలుగులో చాలా చిత్రాల్లో నటించింది. హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ భాషల్లో కొనసాగుతోంది.
తాజాగా ఓ టీవీ ఛానల్ లో ఆలీ వ్యాఖ్యాతగా ప్రసారం అవుతున్న `ఆలీతో సరదాగా` కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఐశ్వర్య ఓ ప్రశ్నకు చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ గా మారింది. మీ కెరీర్లో ఎంత మందిని కొట్టారని ఆలీ అడిగిన ప్రశ్నకు ఐశ్వర్య షాకిచ్చే సమాధానం చెప్పింది. తెలుగు ఇండస్ట్రీలో ఓ దర్శకుడిని కొట్టాలనుకున్నానని, ఇకపై అతను కోటి రూపాయాలు పారితోషికం ఇస్తానన్నా అతని చిత్రాల్లో నటించేది లేదని స్పష్టం చేసింది.
సదరు దర్శకుడు ఒకానొక దశలో తన సహనాన్ని పరీక్షించాడని, తనతో కలిసి పనిచేసిన సినిమా తరువాత అతను ఎదురుపడితే నేను అదంతా మర్చిపోయి పలకరించానని, కానీ అతను మాత్రం తన గురించి ఇతరులతో చెత్తగా చెప్పాడని, అది విని తనని కొట్టకుండా ఎందుకు వదిలేశానా? అని అనిపించిందని, అతని సినిమాలో మనమిద్దరం కలిసి పనిచేశామని ఆలీకి హింట్ ఇచ్చి షాకిచ్చింది ఐశ్వర్య. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి, అత్త పాత్రల్లో నటిస్తున్న ఐశ్వర్య కొట్టాలనుకున్న దర్శకుడు ఎవరన్నది ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ సందర్భంగా ఐశ్వర్య తన సినీ రంగ ప్రవేశానికి సంబధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని కూడా బయటపెట్టింది. తను సినిమాల్లోకి రాకముందు `ఇండస్ట్రీ వైపు కాదు.. అద్దంలో కూడా నీముఖం చూసుకోకని.. చూస్తే అద్దం పగులుతుందని తన ని హేళన చేశారట. అయితే అనుకోకుండానే తాను ఓ కన్నడ సినిమా ద్వారా నటిగా తెరంగేట్రం చేయాల్సి వచ్చిందని, ఆ తరువాతే తెలుగులో జగపతిబాబు నటించిన `అడవిలో అభిమన్యుడు` చిత్రంతో పరిచయం అయ్యానని ఐశ్వర్య పేర్కొంది.