'అమ్మ' పాత్ర కోసం ఐష్ - అనుష్క ల మ‌ధ్య పోటీ?

Update: 2018-08-20 17:21 GMT
ప్ర‌స్తుతం టాలీవుడ్ - బాలీవుడ్ - కోలీవుడ్ ల‌లో బ‌యోపిక్ ల హవా న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో `మ‌హాన‌టి ` సెట్ చేసిన బెంచ్ మార్క్ ను అందుకోవ‌డానికి `ఎన్టీఆర్` - `యాత్ర‌`ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ లో సంజు సాధించిన విజ‌యంతో థాక‌రే బ‌యోపిక్ తెర‌కెక్కుతోంది. ఇక‌, పుర‌చ్చి త‌లైవి - తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ పై ప్రారంభానికి ముందే కాంపిటీష‌న్ మొద‌లైంది. అమ్మ బయోపిక్ ను నిర్మించేందుకు దర్శక‌ నిర్మాతలు పోటీప‌డుతున్నారు. మ‌రోవైపు - జయలలిత పాత్రలో ఐశ్వర్యారాయ్ లేదా అనుష్క శెట్టిల‌లో ఒక‌రిని ఎంచుకునేందుకు లెజెండరీ దర్శకుడు భారతీ రాజా ప్ర‌య‌త్నాలు మొద‌టెట్టార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మొద‌లుకాక ముందే అమ్మ బ‌యోపిక్ పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

న‌టిగా - రాజ‌కీయవేత్త‌గా....త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో అమ్మ చెర‌గ‌ని ముద్ర వేశారు. అటువంటి ధైర్య‌శాలి - మ‌హాన‌టి - రాజ‌కీయవేత్త జీవితాన్ని వెండితెర‌పై ఆవిష్కరించ‌డం అంత సులువేమీ కాదు. అయితే, ఆ చిత్రం హిట్ అయితే వ‌చ్చే పేరు కూడా చిర‌స్థాయిగా నిలిచి పోతుంది. ఏఎల్ విజయ్ - ప్రియదర్శిని ల‌తో పాటు భారతీ రాజా కూడా ఆ బ‌యోపిక్ తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల జాబితాలో చేరారు. అమ్మ పాత్ర‌లో న‌టించేందుకు ఐశ్వ‌ర్యారాయ్ తో పాటు అనుష్క పేర్ల‌ను భార‌తీరాజా ప‌రిశీలిస్తున్నార‌ట‌. జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న ఐష్  - ద‌క్షిణాది స్టార్ హీరోయిన్ అయిన అనుష్క ల మ‌ధ్య పోటీ ఉందట‌. `పురిచ్చి తలైవి` అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించిన భారతీ రాజా....డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించ‌బోతున్నారట‌. ఎంజీఆర్ పాత్ర కోసం కమల్ హాసన్ - మోహన్ లాల్ పేర్లు పరిశీలిస్తున్నారట. మ‌రి, అమ్మ‌ - ఎంజీఆర్ పాత్ర‌ల‌కు ఎవ‌రు ఫైన‌ల్ అవుతారో వేచి చూడాలి.
Tags:    

Similar News