బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. అభిషేక్ బచ్చన్ కోవిడ్ 19 చికిత్స కోసం ముంబై నానావతి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బచ్చన్ కోడలు మనవరాలికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అభిమానుల్లో ఆందోళన రెట్టింపైంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ .. తన కుమార్తె ఆరాధ్య కూడా ఎటువంటి లక్షణాలు లేకుండా పాజిటివ్ అని తేలింది. అయితే ఆ రిపోర్ట్ వచ్చిన అనంతరం ఈ శుక్రవారం నుంచి వీరిద్దరూ జ్వరం గొంతు నొప్పితో బాధపడుతున్నారని తెలుస్తోంది.
దీంత ఆ ఇద్దరినీ తాజాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారిని బిగ్ బి .. జూనియర్ బచ్చన్ మాదిరిగానే ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఐశ్వర్య రాయ్ కు ఇప్పటికే తీవ్ర జ్వరం వచ్చింది. గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని.. ఆరాధ్యకు తేలికపాటి జ్వరం వచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికి బచ్చన్ లు ఇరువురితో పాటు ఆ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
చికిత్స పొందిన తరువాత.. ఐశ్వర్య జ్వరం తగ్గింది. ఆమె గొంతు ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం పట్టింది. పరిస్థితి స్థిరంగా ఉంది. మరోవైపు ఆరాధ్య జ్వరం దాదాపుగా తగ్గిపోయింది. అమితాబ్- అభిషేక్- ఐశ్వర్య - ఆరాధ్య టోటల్ ఫ్యామిలీ ముంబై నానవతి హాస్పిటల్ లో ఒకే వీఐపీ విభాగంలో ఉంచారు. ఆరాధ్య మరియు ఐశ్వర్యలను ప్రస్తుతం డాక్టర్ బార్వే .. డాక్టర్ అన్సారీ వంటి ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో వివిక్త వార్డులో ఉంచారు.
బచ్చన్ కుటుంబ సభ్యులకు కోవిడ్ 19 పాజిటివ్ అని తేలాక ఇప్పటికే 7 రోజులు అయ్యింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం.. రెండవసారి కరోనా పరీక్ష 7 రోజుల తరువాత జరుగుతుంది. వారం తర్వాత రెండవ పరీక్ష ఉంటుందని వైద్యులు వెల్లడించారు. కాబట్టి మొత్తం కుటుంబానికి మరోసారి పరీక్షలకు వైద్య బృందం సిద్ధమవుతోంది.
మరోవైపు బచ్చన్ కుటుంబీకులు వేగంగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు పూజలు పునస్కారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నానావతి ఆసుపత్రిలో చేరినప్పుడు అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం గురించి అభిమానులను వరుస ట్వీట్ల ద్వారా ప్రార్థనలతో అభిమానం చాటుకున్నారు. అమితాబ్ భార్యామణి జయాబచ్చన్ కు.. కరోనా నెగెటివ్ అని పరీక్షల్లో తేలింది. బచ్చన్ కుమార్తె శ్వేతా బచ్చన్ నందా .. మనవరాళ్ళు నవ్య నందా.. అగస్త్యలకు పరీక్షిస్తే నెగెటివ్ రిజల్ట్ వచ్చిన సంగతి విధితమే.