స‌ముద్రం అంచున స‌య్యారే!

Update: 2019-04-22 07:50 GMT
మ్యారేజ్ డే అనేది ఎంతో ఇంపార్టెంట్ డే.  అందుకే ఆ రోజు సెల‌బ్రేష‌న్స్ కోసం క‌పుల్స్ చాలా ముందే ప్ర‌త్యేకించి గోల్స్ పెట్టుకుంటారు. సెల‌బ్రిటీలు.. ఫేజ్ 3 జ‌నం అయితే సుదూర తీరంలో ఒంట‌రి దీవుల‌కు వెళ్లి అక్క‌డ న‌చ్చిన‌ట్టు ఎంజాయ్ చేసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. క‌పుల్ స్టాట‌స్ ఏదైనా.. ఎవ‌రైనా చేస్తున్న‌ది ఇదే. తాజాగా మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ - అభిషేక్ బ‌చ్చ‌న్ జంట మాల్దీవుల విహారానికి వెళ్లారు. ఏప్రిల్ 20న‌ పెళ్లి రోజు సంద‌ర్భంగా కుటుంబ స‌మేతంగా ఈ ట్రిప్ ని ప్లాన్ చేశారు. 2007లో పెళ్లి చేసుకున్న ఈ జంట తాజాగా 12వ వార్షికోత్స‌వం జ‌రుపుకుంది.

మాల్దీవుల్లో సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటోల్ని అభిషేక్ సామాజిక మాధ్య‌మాల ద్వారా విరివిగా షేర్ చేశారు. ఒంట‌రి దీవుల్లో డీప్ సీ అంచున ఉన్న ఓ ఈత కొల‌నులో ఐశ్వ‌ర్యారాయ్ .. కుమార్తె ఆరాధ్య‌తో క‌లిసి స్విమ్ చేస్తున్నారు. చిన్నారి ఆరాధ్య ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఈత నేర్చుకుంటూ క‌నిపించింది. ఇలాంటి ఎన్నో స్ట‌న్నింగ్ ఫోటోల్ని అభిషేక్ బ‌చ్చ‌న్ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అవి అభిమానుల్లోనూ వైర‌ల్ అయిపోతున్నాయి. ఈ ఫోటోల‌కు `హ్యాపినెస్ మై గాళ్స్!` అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు స్మాల్ బి. ఇన్ స్టాగ్ర‌మ్ లో రెండు ల‌క్ష‌ల మంది ఫ్యాన్స్ ఇప్ప‌టికే లైక్ లు కొట్టారు ఈ ఫోటోల‌కు.

ఇలాంటి అరుదైన లొకేష‌న్ లో బులుగు జిలుగు వాతావ‌ర‌ణంలో అలా రొమాంటిక్ గా మ్యారేజ్ డే సెల‌బ్రేష‌న్స్ చేసుకున్న ఈ జంట త‌దుప‌రి సినిమాల ప‌రంగానూ గోల్స్ ఫిక్స‌య్యారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఐశ్వ‌ర్యారాయ్ - అభిషేక్ బ‌చ్చ‌న్ కెరీర్ ప్ర‌స్తుతం డోలాయ‌మానంలోనే ఉంది. ఇటీవ‌ల ఐష్ న‌టించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాల్ని అందుకోక‌పోవ‌డంతో సినిమాలు త‌గ్గాయి. అభిషేక్ కి ప్ర‌స్తుతం సినిమాల్లేవ్. వివాదాస్ప‌ద `మ‌న్మార్జియాన్` తో ఇటీవ‌ల‌ హిట్ కొట్టిన గురుడికి ఎవ‌రూ ఛాన్సులిచ్చేందుకు ముందుకు రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. ఆ క్ర‌మంలోనే ఈ జంట‌ దేశ‌విదేశాల్లో ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళుతూ బిజీగా ఉన్నారు.
   
Tags:    

Similar News