ఆ బ్యాంక్‌ ప్రచారకర్తగా ఐసూ...

Update: 2015-08-07 16:15 GMT
పేగు (బొడ్డు తాడు)  తెంచుకుని బిడ్డ ఇహలోకంలోకి రాగానే .. ఆ క్షణం వరకూ అనుభవించిన నరకాన్ని మర్చిపోయి.. పరవశంలో మునిగిపోతుంది ఏ తల్లి అయినా. అయితే ఆ బిడ్డ తన జీవితంలో ఎంతో ఆనందంగా ఉండాలంటే, కొన్ని జన్యుపరమైన రుగ్మతల్ని, సవాళ్లను ఎదుర్కోవాలంటే తల్లులంతా ఆ క్షణం చేయాల్సిన పని ఒకటి ఉంది. ప్రసూతి ఆస్పత్రుల్లో బిడ్డను కనడానికి వెళ్లే ముందే తమ బిడ్డ క్షేమం కోసం స్టెమ్‌ సెల్స్‌(బొడ్డుతాడు) ని భద్రపరిచే అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆస్పత్రి కి చేరకముందే అది నిర్ణయించుకోవాలి.

ఇప్పటివరకూ ఇలా స్టెమ్‌ సెల్స్‌ ని భద్రపరిచే ఫెసిలిటీ మనకు లేదు. కానీ ఇప్పుడు వచ్చేసింది. మొ లైఫ్‌ సెల్‌ .. ఇండియాలోనే మొట్ట మొదటి స్టెమ్‌ సెల్‌ బ్యాంక్‌. దీనికి ఐశ్వర్యారాయ్‌ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇక నుంచి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ప్రత్యేక విషయం స్టెమ్‌ సెల్‌ బ్యాంక్‌ .. అందరికీ అందుబాటులోనే ఉంది అని ఐశ్వర్యారాయ్‌ చెబుతోంది. స్టెమ్‌ సెల్‌ బ్యాంక్‌ అనే విషయం గురించి ఇదివరకే ప్రిన్స్‌ మహేష్‌ సైతం ఎంతో ప్రచారం చేశారు. బిడ్డ భద్రతకు, ఆరోగ్యంగా బతకడానికి ఇది అత్యంత అవసరం అని ప్రిన్స్‌ ప్రచారం చేశాడు అప్పట్లో. ఇప్పుడు ఆ బాధ్యతను ఐశ్వర్యారాయ్‌ తీసుకుందన్నమాట!
Tags:    

Similar News