ఐశ్వర్యా రాయ్ పెళ్ళికి ముందు పెద్ద స్టార్ హీరోయినే గానీ ఇప్పుడు మాత్రం కాదు. కూతురు ఆరాధ్య పుట్టిన తర్వాత కొన్నేళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న ఐష్ మళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చింది గానీ ఇప్పటివరకూ ఒక్క హిట్టూ లేదు. ఇక ఐష్ లాస్ట్ సినిమా 'ఫ్యానీ ఖాన్' కూడా నిరాశపరిచింది. ఇక ఈ సినిమా కంటే ముందు 'జాస్మిన్' అనే ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి గానీ ఇప్పటివరకూ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మరో అప్డేట్ బయటకు రాలేదు.
సిద్ధార్థ్ - గరిమా అనే రైటర్స్ సరోగేట్ మదర్(అద్దె గర్భం ఇచ్చే తల్లి) కాన్సెప్ట్ తో ఒక స్టొరీని తయారు చేసి ఐష్ కు వినిపించారట. ఐష్ కు స్టొరీ నచ్చడంతో స్క్రిప్ట్ డెవలప్ చేయమని చెప్పిందట. కానీ తర్వాత ఏమైందో తెలీదు. రీసెంట్ ఒక ఇంటర్వ్యూ లో 'జాస్మిన్' గురించి ఐష్ ను అడిగితే "స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని సూచించాను. కానీ తర్వాతేం జరిగిందో తెలియదు" అని చెప్పింది.
ఐష్ ఏం జరిగిందో తెలియదని అంటోంది కానీ ఆ రైటర్స్ స్క్రిప్ట్ లో మార్పులు చేసి మళ్ళీ కథ వినిపించారట. కానీ ఐష్ కు స్క్రిప్ట్ సంతృప్తికరంగా అనిపించకపోవడంతో 'నో' చెప్పిందట. దీంతో చేసేది లేక ఆ రైటర్స్ వేరే ప్రాజెక్టుతో బిజీ అయ్యారని బాలీవుడ్ టాక్. ఈ లెక్కన 'జాస్మిన్' లేనట్టే.