ఫోటో స్టోరి: అబ్బబ్బా ఐష్‌!!

Update: 2017-04-17 11:30 GMT
ఆల్రెడీ 40 టచ్ అయ్యింది కాబట్టి.. ఇక ఐశ్వర్య రాయ్ లో వాడి వేడి తగ్గిపోతోంది అనుకుంటున్నారేమో.. అబ్బే అస్సలు తగ్గట్లేదు. అందుకు సాక్ష్యంగా ఇప్పుడు అమ్మడు బాలీవుడ్ పవర్ గాళ్‌ అంటూ వస్తున్న ఒక ప్రత్యేక సంచికపై తన గ్లామర్ పవర్ ఏంటో చూపించేసింది.

ఫిలింఫేర్ కొత్త ఎడిషన్ పై ఐష్‌ తన అందచందాలతో మతిపోగొట్టేసిందంతే. ఎప్పుడు కేన్స్ చలనచిత్రోత్సవంలో ఆరేసినట్లు ఇప్పుడు అమ్మడు మరోసారి క్లీవేజ్ తళుకులను ఆరేసింది. ఈ మధ్యకాలంలో ఏ దిల్ హై ముష్కిల్ సినిమా రిలీజ్ టైములో ఇదే విధంగా ఫిలింఫేర్ కవర్ పై రెచ్చిపోయిన ఐషూ.. ఇప్పుడు మరోసారి అదే రేంజు హాట్నెస్ తో మండుటెండల్లో ఇంకాస్త టెంపరేచర్ పెంచేస్తోందంతే. ఈ వేడిమిని తట్టుకోలేక అక్కడ యువత అబ్బబ్బా అంటున్నారు.

ఇకపోతే త్వరలోనే ఐష్‌ ఒక భారీ ప్రాజెక్టుతో వస్తోందట. ఇప్పటివరకు అనుకున్న చాలాపాత్రలు చేస్తుందో లేదో తెలియదు కాని.. పద్మావతి సినిమాలో మాత్రం గెస్ట్ రోల్ చేసే ఛాన్సుంది. అయితే ఐష్‌ రి-ఎంట్రీ తరువాత ఇప్పటివరకు ఒక హీరోయిన్ తన ముద్రను వేయలేకపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News