టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇటీవల 'టక్ జగదీశ్' చిత్రంలో కనబరిచిన అభినయానికి ఆడియన్స్ అందరూ ఫిదా అయ్యారు. 'రాంబంటు' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఐశ్వర్య.. 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈమె అలనాటి నటుడు రాజేష్ కుమార్తె.. హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు.
కెరీర్ ప్రారంభం నుంచీ గ్లామర్ షో కు దూరంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మాత్రమే నటిస్తూ వస్తోంది. తెలుగులో 'వరల్డ్ ఫేమస్ లవర్' 'మిస్ మ్యాచ్' వంటి చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో 'భీమ్లా నాయక్' చిత్రంలో నటించాల్సి ఉండగా.. ఐశ్వర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు లేటెస్టుగా టాక్ వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ''భీమ్లా నాయక్''. ఇందులో పవన్ కు జోడీగా నిత్యా మీనన్.. రానా భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ ను తీసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత మీడియా ముఖంగా వెల్లడించారు. అయితే డేట్స్ సమస్య వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో ఈ చిత్రంలో తన పాత్ర నిడివి తక్కువగా ఉండటం.. పెద్దగా ప్రాధాన్యత కూడా లేకపోవడంతో ఐశ్వర్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. కారణం ఏదైనా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ నుంచి టాలెంటెడ్ బ్యూటీ తప్పుకుందనే వార్తలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐశ్వర్య స్థానంలో మలయాళ నటి సంయుక్తా మీనన్ ను తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని సమాచారం.
ఇకపోతే తమిళంలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ స్టేటస్ అందుకున్న ఐశ్వర్య రాజేష్.. ఇటీవల కాలంలో తెలుగులో రాణించడానికి ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే ‘టక్ జగదీష్’ లో గుర్తుండిపోయే పాత్ర పోషించింది. సాయి ధరమ్ తేజ్ సరసన ఈ బ్యూటీ నటించిన 'రిపబ్లిక్' సినిమా అక్టోబర్ 1న రిలీజ్ అవుతోంది. అలానే ఈమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మలయాళ రీమేక్ 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' సినిమా షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటుగా మరో మూడు తమిళ చిత్రాల్లో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది.